అణ్వాయుధ ప్రభావం ఎంతుంటుందో తెలుసా ?

Update: 2022-10-18 04:35 GMT
ఇపుడు ప్రపంచ దేశాల ఆలోచనలన్నీ అణ్వాయుధ ప్రయోగం చుట్టే తిరుగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గడచిన ఏడు నెలలకు పైగా జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా ఒక్కటి ఒకవైపు అమెరికా దాని మిత్ర పక్షాల మద్దతుతో ఉక్రెయిన్ మరోవైపు యుద్ధం చేస్తున్నది. నిజానికి రష్యా ముందు ఉక్రెయిన్ చిట్టెలుకతో సమానం. కానీ అమెరికా వంటి అగ్రరాజ్యం మద్దతు కారణంగా ఉక్రెయిన్ రెచ్చిపోతోంది.

సరే ఈ పద్ధతిలో ఉక్రెయిన్ ఎంతకాలం యుద్ధం చేయగలదు ? ఎంతకాలమంటే అమెరికా, మిత్రదేశాల మద్దతున్నంత కాలం. లేదా రష్యా అలిసి పోయేంతవరకు. అయితే ఇంకా ఎక్కువకాలం యుద్ధం జరిగితే జనాల్లో లేదా సైనికుల్లో తిరుగుబాటు వచ్చే అవకాశముందని రష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్ కు భయం మొదలైనట్లుంది. అందుకనే ఒక అణుబాంబును ఉక్రెయిన్ మీదపడేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు.

అనుకోవటమే కాదు అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనకాడేదిలేదని పదే పదే హెచ్చరిస్తున్నారు. పుతిన్ మాటలు చూస్తుంటే అన్నంతపనీ చేసేట్లే ఉన్నారు. అందుకనే ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది. నిజంగానే అణుబాంబులు ప్రయోగిస్తే ప్రపంచంలో సుమారు 500 కోట్లమంది చనిపోతారని అంచనా.

అణుబాంబు వేసేది ఉక్రెయిన్ పైనే అయినా దాని ప్రభావం చుట్టుపక్కలున్న రుమేనియా, పోలండ్, కజఖిస్తాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లాంటి అనేక దేశాలపైనా తీవ్రంగా ప్రభావం చూపుతుందట.

రష్యా అణుబాంబు వేస్తే అమెరికా చూస్తు ఊరుకోదుకదా. రష్యాపై అమెరికా కూడా అణుబాంబు వేయటానికి రెడీ అవుతోంది. అప్పుడు మరికొన్ని దేశాలు కచ్చితంగా ఎఫెక్టవుతాయి.

ఇలా హోలు మొత్తంమీద సగం దేశాల్లోని జనాభా తుడిచిపెట్టుకుపోతోందట. జనాలు చనిపోవటమే కాదు వాతావరణ కాలుష్యం, పశుజాతులు, నీటికాలుష్యం అంతా పెరిగిపోతుంది. చనిపోయిన వారు అదృష్టవంతులుగా మిగిలిపోతారు. ఎందుకంటే బతికున్న వారిమీద అణుబాంబు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. చెప్పలేనన్ని రోగాలతో జనాలు అల్లాడిపోతారు. ఇందుకనే ప్రపంచదేశాల్లో  పుతిన్ హెచ్చరికలతో టెన్షన్ పెరిగిపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News