చైనా అతి పెద్ద కమ్యూనిస్టు దేశం. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిత్యం చైనాపై విరుచుకుపడే వారు. మరీ ముఖ్యంగా కరోనా ప్రబలిన తర్వాత.. ట్రంప్ నిత్యం మీడియా మీటింగులు పెట్టి మరీ చైనా పై విమర్శలు గుప్పించేవారు. దీంతో అప్పట్లో చైనా.. ట్రంప్‌పై విరుచుకు పడింది. ట్రంప్ ఎంత తొందరగా దిగిపోతే... అంత మంచిది అన్నట్టుగా అప్పట్లో చైనా సర్కారు భావించింది. మీడియా కూడా ఇలానే ప్రచారం చేసింది.
చైనా అనుకున్నట్టే.. ట్రంప్ దిగిపోయారు. అయితే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకున్న శ్వేత సౌధం అధ్యక్షుడు జో బైడెన్.. మరింతగా చైనాకు దడ పుట్టిస్తున్నారు. ఇదే విషయాన్ని చైనా పత్రికలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ హయాంలో మొత్తం 31 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. బైడెన్ వచ్చి ఇంకా ఆరు నెలలు పూర్తికాలేదు. ఆయన మరో 28 కంపెనీలను అందులో చేర్చారు. చైనా కంపెనీల బ్లాక్ లిస్ట్ జాబితాను విస్తరిస్తూ బైడెన్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఇప్పుడా జాబితాలో ఉన్న చైనా కంపెనీల సంఖ్య 59కి చేరింది. ముఖ్యంగా నిఘా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని వీటిపై ఆరోపణలు చేసింది. అంతేకాదు ఈ సంస్థలు చైనా సైన్యంతో కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఈ ఆదేశాలు ఆగస్టు 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో చైనాకు మెల్లగా ఆ నిర్ణయాల సెగ తగులుతోంది. మరోపక్క ట్రంప్ విధించిన టారిఫ్‌ల్లో ఒక్క దానిని కూడా తొలగించలేదు. ఇప్పుడు వాటికి అదనంగా.. విస్తరించిన కొత్త బ్లాక్ లిస్ట్ జాబితాను ప్రకటించారు. ఈ పరిణామంతో డ్రాగన్ కంట్రీ అట్టుడుకుతోంది. అలాగని బైడెన్‌ను నేరుగా విమర్శించలేక.. సర్దుబాటు చేసుకోలేక సతమతం అవుతోంది. మరి మున్ముందు.. చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.