ఏపీలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యావసరాలు, కూరగాయల కోసం జనాలు ఎగబడుతూనే ఉన్నారు. ఇదే అదునుగా కూరగాయల విక్రేతలు ధరలు పెంచి మోసం చేస్తున్నారు. దీంతో దీని సంగతి తేల్చాలని.. కట్టడి చేయాలని ప్లాన్ చేసిన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ కేసీ కిషోర్ కుమార్ సరికొత్త వేషం వేశారు.
కూరగాయల ధరలు సరైన ధరకు అమ్ముతున్నారా లేదా అని తెలుసుకోవడానికి పోలీసులు, ఇతర అధికారులను పంపే బదులు తనే సామాన్యుడిలో మారిపోయాడు. సామాన్యుడి అవతారంలో వేషం మారు వేషం వేసుకొని రైతు బజాన్ ను పరిశీలించడానికి వెళ్లాడు. సినిమాటిక్ వేలో జేసీ రెచ్చిపోయారు.
కూరగాయల కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు జాయింట్ కలెక్టర్ కాగితంపై ధరలు రాశాడు. ఏ కూరగాయాలను ఏ ధరకు అమ్ముతున్నారనే దానిపై రాసుకున్నాడు. ఈ సంక్షోభ సమయంలో ఏ విధంగా అమ్ముతున్నారనే విషయం పై ఆరాతీశారు.
ఈ సందర్భంగా అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. కొద్దిగా మాత్రమే రేట్లు పెంచారని.. ఇది రీజనబుల్ రేట్ అని తెలిపారు. తక్కువ ధరకే కూరగాయాలు లభిస్తున్నాయని జేసీ తేల్చారు.