తెలంగాణకు మరో పెద్ద పెట్టుబడి వస్తోంది. ఊహించని విధంగా అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు రాగా.. తాజాగా మరో సంస్థ భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.
ఐటీ , పరిశ్రామల శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖకు సంబంధించిన అధికారులు విదేశాల్లో పర్యటించి మరీ వివిధకంపెనీలను ఆహ్వానించారు. భారీగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో భారీ పెట్టుబడి హైదరాబాద్ కు రాబోతోంది.
ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. ఆ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
సాఫ్రాన్ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్వో ఏర్పాటుకు సాఫ్రాన్ నిర్ణయించిందన్న ఆయన.. హైదరాబాద్లో సోఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్వో ప్రపంచంలోనే పెద్దదని పేర్కొన్నారు. ఇక ఓ ప్రపంచ స్థాయి సంస్థ భారత్ లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్వో ఇదేనని ఎంఆర్వో , ఇంజిన్ టెస్ట్ సేల్ పెట్టుబడి 150 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 1200 కోట్లు అని వెల్లడించారు.
ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో 800 నుంచి 1000 మంది వరకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది భారతీయ, విదేశీ వాణిజ్య విమానయాన సంస్థలు తెలంగాణపై ఆసక్తికి నిదర్శనమన్నారు.
విదేశీ వాణిజ్య విమానయాన సంస్థలు ఉపయోగించే మార్కెట్ లీడింగ్ లీప్ 1ఏ మరియు లీప్ 1బీ ఏరో ఇంజిన్ లకు సేవలు అందించనుంది. ఈ ఇంజన్ ఎంఆర్వో ప్రాజెక్ట్ తెలంగాణలోని స్థానిక ఏరోస్పేస్ తయారీ మరియు ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నాం.ఈ పెట్టుబడితో హైదరాబాద్లో భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఏర్పోసేస్ వ్యాలీకి దోహదపడుతుందని ‘ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా హైదరాబాద్ మారనుందని కేటీఆర్ ట్వీట్ చేసి మరీ ఆనందపడ్డారు.