రోడ్డుపై శివ‌లింగం ఉంచి.. ఇజ్రాయెల్ వాసులు ఏం చేశారో తెలుసా?

Update: 2021-05-09 10:30 GMT
ప్ర‌పంచంలో ఏ దేశాన్ని కూడా పీడించ‌ని విధంగా క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్ ను అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. నిత్యం ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన ప‌డుతుండ‌గా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ దేశాలు భార‌త్ కు అండ‌గా నిల‌స్తున్నాయి.

ఇప్ప‌టికే సుమారు 40 దేశాలు.. త‌మ‌కు తోచిన విధంగా స‌హాయం చేశాయి. చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ఆక్సీజ‌న్, రెమ్ డెసివ‌ర్ వంటి ఇంజెక్ష‌న్లు స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. ఇందులో ఇజ్రాయెల్ కూడా ఉంది. అయితే.. భౌతిక స‌హాయం చేయ‌డంతోపాటు.. దేవుడిని సైతం ప్రార్థిస్తున్నారు ఇజ్రాయెల్ వాసులు.

భార‌త‌దేశం కొవిడ్ మ‌హ‌మ్మారి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల‌ని శివుడిని పూజించడం విశేషం. ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ లోని మెయిన్ చౌర‌స్తాలో శివ‌లింగాల‌ను ఏర్పాటు చేసి పూజ‌లు చేశారు. ‘ఓం నమఃశివాయ‌’ అంటూ ప్రార్థించారు. ఇజ్రాయెల్ లోని ఇండియ‌న్ ఎంబ‌సీ అధికారి ప‌వ‌న్ కె. పాల్ త‌న ఇన్ స్టా అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.

ఇది చూసిన భార‌తీయులు ఇజ్రాయెల్ వాసుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు. క‌ష్ట‌కాలంలో తోడుగా ఉన్నందుకు, ఇంత‌గా ఆత్మీయ‌త చూపుతున్నందుకు ముగ్ధుల‌వుతున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చాలా మంది నెటిజ‌న్లు కామెంట్ల‌తో త‌మ సంతోషం ప్ర‌క‌టిస్తున్నారు.
Tags:    

Similar News