కొద్దికాలం కిందటి వరకు కొనసాగిన కరోనా కలకలానికి బ్రేక్ వేస్తూ తెలంగాణలో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,261 పాజిటివ్ కేసులు నమోదు అవగా మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. తాజా లెక్కలతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిపోయిందని...రికవరీ రేటు 99.5 శాతానికి పెరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన లాక్ డౌన్ గురించి కీలక క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని శ్రీనివాస్ రావు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2261 కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు కరోనా నుంచి మూడు వేల 43 మంది కోలుకున్నారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివీటి రేటు 2 శాతానికి తగ్గిందని అన్నారు. గ్రామాల్లోనూ లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత తగ్గించేందుకు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 87 లక్షలకు పైగా ఇళ్లలో రెండో దశ ఫీవర్ సర్వే పూర్తి చేశామన్నారు. వచ్చే వారంలో కరోనా కేసులు తగ్గితే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంటుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు.
గత పది రోజులుగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1100 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, లాక్ డౌన్ విషయంలో వైద్యారోగ్య సంచాలకుడు చేసిన వ్యాఖ్యలతో త్వరలోనే లాక్ డౌన్ ఎత్తేస్తారనే ప్రచారం జరుగుతోంది.