తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసా?

Update: 2021-02-02 13:45 GMT
దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ కు ఓటమి.. జీహెచ్ఎంసీలో ఎదురుదెబ్బ.. ఈ క్రమంలోనే దూసుకొచ్చిన బీజేపీ ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే విజయం సాధిస్తుందా? లేక గులాబీపార్టీనే జనం కోరుకుంటున్నారా? అసలు తెలంగాణ ప్రజల నాడి ఏంటనే దానిపై తాజాగా 'సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ సెఫాలజీ స్టడీస్' ఓ సర్వే నిర్వహించింది. అందులో షాకింగ్ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణలో ఇప్పుడు బీజేపీ బలం పుంజుకుంటోంది. అధికార టీఆర్ఎస్ ను ఓడగొడుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ బీజేపీ అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీది విజయం అని చూడగా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.  బీజేపీకి 49 నుంచి 54 సీట్లు..  వస్తాయని తేలింది. అదే సమయంలో టీఆర్ఎస్ కు కేవలం 14-16 సీట్లు మాత్రమే వస్తాయట.. ఇక కాంగ్రెస్ పార్టీకి 43-47 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.  ఈ విషయాన్ని 'సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ సెఫాలజీ స్టడీస్' సంస్థ బయటపెట్టింది.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబర్ 28 నుంచి జనవరి 19వ తేదీల మధ్య 1.80 లక్షల శాంపిళ్లను సేకరించి ఈ సర్వే చేపట్టారు. టీఆర్ఎస్ సర్కార్ పనితీరు బాగుందని 19.9శాతం మంది చెబితే.. ఫర్వాలేదని 38.1 శాతం మంది.. బాగోలేదని 39.8శాతం మంది.. చెప్పలేమని 3
3శాతం మంది చెప్పారు. ఇక కేసీఆర్  పనితీరు బాగుందని 21.4 శాతం మంది.. ఫర్వాలేదని 33.3 శాతం మంది.. బాగోలేదని 43.4శాతం మంది .. చెప్పలేమని 2శాతం మంది చెప్పారని సర్వే సంస్థ తెలిపింది.

ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలున్నాయని సర్వేలో తేలింది.  కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగుందని 36.6 శాతం మంది చెప్పారట. ఫర్వాలేదని 43.2 శాతం మంది, బాగోలేదని 17.5 శాతం మంది, చెప్పలేమని 2.7 శాతం మంది చెప్పారు.

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 37.4శాతం ఓట్లశాతం, కాంగ్రెస్ కు 31.8శాతం ఓట్లశాతం.. టీఆర్ఎస్ కు 13.5శాతం ఓట్ల శాతం వస్తుందని తేలింది. మజ్లిస్ కు 14.2శాతం వస్తాయని సర్వే తేల్చింది.
Tags:    

Similar News