అవ‌స‌ర‌మైన‌ప్పుడల్లా.. జూనియ‌ర్‌ ను వాడేస్తున్నారా?

Update: 2021-11-26 11:30 GMT
ఎప్పుడు అవ‌స‌రం అయితే.. అప్పుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. నంద‌మూరి కుటుంబానికి చెందిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ను అవ‌స‌రానికి త‌గిన‌ట్టు వాడేస్తున్నార‌నే కామెంట్లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. జూనియ‌ర్‌కు ఒక్క‌సాయం కూడా చేయ‌ని.. చంద్ర‌బాబు.. ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా.. ఎప్పుడుపార్టీ దెబ్బ‌తింటోంద‌ని అనుకున్నా.. జూనియ‌ర్ పేరును వాడుకుంటున్నా ర‌ని అంటున్నారు. గ‌తంలో 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న‌ను ప్ర‌చారానికి దింపి.. అప్ప‌టి వైఎస్ రాజ‌ శేఖ‌ర‌ రెడ్డిని తాను ధైర్యంగా ఎదుర్కొన‌లేక‌.. జూనియ‌ర్‌తో రాజ‌కీయాలు చేయించార‌ని గుర్తు చేస్తున్నారు.

నాడు టీడీపీ ఎంతో దీన‌ స్థితిలో ఉంది. చంద్ర‌బాబు జూనియ‌ర్ ఇంటికి వెళ్లి మ‌రీ ఒప్పించి ఆయ‌న‌తో ప్ర‌చారం చేయించుకున్నారు. నాడు ప్ర‌జారాజ్యం పార్టీ పోటీలో ఉండ‌డంతో టీడీపీకి స‌రైన సినీ గ్లామ‌ర్ లేదు. అప్పుడు ఎన్టీఆర్ తాను ఉన్నానంటూ ముందుకు వ‌చ్చి పార్టీకి ప్ర‌చారం చేశారు. నిజానికి అప్ప‌ట్లో ప్రచారం ముగించుకుని.. వ‌స్తున్న క్ర‌మంలో జూనియ‌ర్‌ ప్ర‌మాదానికి గురైతే..కూడా విడిచిపెట్ట‌కుండా... ఆసుప‌త్రి నుంచి కూడా ప్ర‌చారం చేయించుకున్నార‌ని బాబుపై విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఆ త‌ర్వాత‌.. త‌న కుమారుడు లోకేష్ కు ఎక్క‌డ పోటీ అవుతారో.. అని భావించి.. గ‌త 2014-19 మ‌ధ్య క‌నీసం.. జూనియ‌ర్ పేరు కూడా ప్ర‌స్తావించ‌లేద‌ని జూనియ‌ర్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మ‌రోసారి.. చంద్ర‌బాబు కు అవ‌స‌రం రాగానే.. మ‌రోసారి జూనియ‌ర్ కేంద్రంగా రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. ఆయ‌నను వాడుకుని.. భావోద్వేగాలు రెచ్చ‌గొట్టి.. టీడీపీని బ‌లోపేతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు.

ఇటీవ‌ల ఏపీ అసెంబ్లీలో త‌న‌కు, త‌న భార్య‌కు తీవ్ర అవ‌మానం జ‌రిగింద‌ని.. చెబుతూ..చంద్ర‌బాబు క‌న్నీరు కార్చ‌డం..ఆ వెంట‌నే నంద‌మూరి కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకురావ‌డాన్ని.. గుర్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను జూనియ‌ర్ ఖండించినా.. విడిచి పెట్ట‌కుండా.. ఆయ‌న అలా స్పందించ‌లేదు.. ఇలా స్పందించ‌లేదు.. అంటూ.. మ‌ళ్లీ మ‌ళ్లీ.. జూనియ‌ర్‌ను రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మానికి తెర‌దీశార‌ని జూనియ‌ర్ అభిమానులు పేర్కొంటున్నారు.

అంటే.. త‌న‌కు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు.. త‌న‌కు న‌చ్చిన విధంగా.. జూనియ‌ర్‌ను వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఇవ‌న్నీ.. జూనియ‌ర్ అభిమానులు గ‌మ‌నిస్తున్నార‌ని.. అంటున్నారు. మ‌రి ఇది చంద్ర‌బాబుకు ఎఫెక్ట్ అవుతుందా? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది.
Tags:    

Similar News