వైద్యులు అంటే దేవుళ్లతో సమానం. అమ్మ మనకు జన్మనిస్తే... ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వారు పునర్జన్మనిస్తారు. అందుకే వైద్యులను దేవుళ్లతో పోల్చుతారు. డాక్టర్లకు ఎనలేని గౌరవం ఇస్తుంటాం. ఈ కరోనా కష్టకాలంలోనూ వారు ఎంతో విలువైన సేవలను అందిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుతున్నారు. వారి కుటుంబాలకు, ఇళ్లకు దూరంగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. కరోనా రక్కసి బారిన పడకుండా ఒంటినిండా కవర్లు ధరిస్తూ ఊపిరి సలపకున్నా... పంటి బిగువున బాధను అదిమి ఉంచి కొవిడ్ రోగులకు అత్యుత్తమైన సేవలందిస్తున్నారు. కాగా విధి నిర్వహణలో చాలామంది వైద్యులు అసువులు బాసారు. అయితే ఇంతటి గొప్ప వైద్యులు ఉన్న ఈ కాలంలో ఓ డాక్టర్ మాత్రం పేషెంట్ ప్రాణాలతో చెలగాటంఆడారు.
కాలేయం సమస్యతో ఆస్పత్రిలో చేరిన రోగికి కొత్త సమస్యలు తీసుకొచ్చారు. బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తి లివర్ ప్రాబ్లమ్ తో సైమన్ అనే వైద్యుడిని సంప్రదించాడు. ఆయన ఆపరేషన్ నిర్వహించాడు. అయినా సమస్య తగ్గకపోగా... ఇంకా ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో వేరే వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ నిర్వహించిన పరీక్షల్లో నివ్వెరపోయే అంశాలు బయటపడ్డాయి. ముందుగా ఆపరేషన్ చేసిన డాక్టర్ సైమన్... పేషంట్ కాలేయంపై తన సంతకం పెట్టినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
కాలేయంపై అక్షరాలు ఉండడం వల్లే ఆ వ్యక్తి సమస్య తగ్గకపోగా... కొత్త సమస్యలు వచ్చాయని డాక్టర్ చెప్పారు. కాగా దీనిపై బాధితుడు మెడికల్ ట్రిబ్యునల్ కు వెళ్లారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. కాగా వారు ఆ డాక్టర్ కు రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ అంశంపై మరోసారి విచారణ జరిపారు. అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం... డాక్టర్ సైమన్ ను వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
డాక్టర్ మీద ఉన్న నమ్మకంతో వస్తే ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అంటూ డాక్టర్ సైమన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. రోగుల ప్రాణం అంటే అంత నిర్లక్ష్యమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు వైద్యులు కూడా దీనిపై స్పందించారు. ప్రాణం పోసే డాక్టర్లు ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదంటూ తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. కాగా సైమన్ ను శాశ్వతంగా తొలగించడాన్ని వాళ్లు సమర్థిస్తున్నారు.