కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింత ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ తరుణంలో కూడా ప్రాణాలని పనంగా పెట్టి వైద్యులు కరోనా పేషేంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరి అలాంటి సేవలకు అన్ని విధాలా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. లేకపోతే ప్రాణాలు కాపాడే దేవుళ్లు సైతం ప్రమాదంలో పడతారు. వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లను అందించి డాక్టర్లు వైరస్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
కరోనా వైరస్ కు ముందుండి పోరాడుతున్న వైద్యులకు పీపీఈ కిట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని మన దగ్గరే కాదు జర్మనీ లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలను పక్కన బెట్టి ముందు మాకు రక్షణాత్మక దుస్తులు, పరికరాలను సరఫరా చేయండని వారు డిమాండ్ చేస్తున్నారు. కరోనా వైరస్ తీవ్ర స్థాయలో ప్రపంచవ్యాప్తంగా విజృంభించడం తో రక్షణాత్మక పరికరాలు, దుస్తులైన గ్లవ్స్, మాస్క్స్, వెంటిలేటర్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే , పీపీఈ కిట్లు లేకపోతె వైద్యుల ప్రాణాలకి కూడా ప్రమాదమే.
రోగులకు ధైర్యం వైద్యం అందించాలంటే తప్పకుండా పర్శనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లు అవసరం. అయితే, ప్రభుత్వాలు తగిన సంఖ్యలో పీపీఈ కిట్లను అందించడం లేదు. దీంతో ఆగ్రహించిన జర్మనీ వైద్యుల బృందం ఇలా దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్లాంక్ బెడెంకెన్’ పేరుతో ఓ వెబ్ సైటును ప్రారంభించి మరీ వైద్యుల బృందం తమ నగ్న చిత్రాలను పోస్టు చేస్తున్నారు. ‘‘పీపీఈ కిట్లు లేకపోతే మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చెప్పేందుకే.. ఇలా నగ్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం’’ అని వైద్యులు తెలుపుతున్నారు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, కేవలం స్కెతస్కోప్ మాత్రమే మెడలో వేసుకుని ఫొటోలకు పోజులిస్తున్నారు. అయితే , ప్రస్తుతం పీపీఈ కిట్ల కి డిమాండ్ భారీగా పెరిగి పోవడంతో సరఫరా సరిపోవడం లేదు అని, అందువల్లే అందరికీ అందించలేకపోతున్నామని జర్మనీ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఒకరు అంగీకరించారు. ఇప్పటికే 133 మిలియన్ మాస్క్ లను దేశ వ్యాప్తంగా పంపిణీ చేసినట్టు తెలిపారు.
తాజా గణాంకాల ప్రకారం జర్మనీలో ఇప్పటికే ఒక లక్షా 59 వేల మందికి కరోనా వైరస్ సోకింది. అందులో ఆరు వేల మందికి పైగా చనిపోయారు. జర్మనీ ఇంకా కరోనా వైరస్ తీవ్రత నుంచి బయటపడలేదని, ఇంకా చాలా కాలం పట్టవచ్చునని చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ స్పష్టం చేశారు. ఇది వినడానికి కష్టంగా ఉన్నప్పటికీ కరోనా తో మనం కొంత కాలం కలిసి జీవించాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు.