పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని భారత్ కు అప్పగించే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఆంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికా పోలీసులకు చిక్కిన ఛోక్సీకి సంబంధించి రెండు కేసులు అక్కడి కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఆ కేసుల్లో తీర్పు వచ్చేంతవరకు ఛోక్సీని పంపించే అవకాశం లేదు. దీంతో ఆయనను తీసుకొచ్చేందుకు వెళ్లిన భారత దర్యాప్తు సంస్థల బృందం స్వదేశానికి తిరుగు పయనమైంది.
గత నెల 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన ఛోక్సీ. ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికా దేశంలో ప్రత్యేక్షం కావడంతో అక్కడి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఛోక్సీని అక్రమంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన లీగల్ టీం చెబుతుండగా అక్రమంగానే ప్రవేశించారని పోలీసులు చెప్తున్నారు. ఛోక్సీ అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించింది. దీనిపై తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. ఇక ఛోక్సీ కోసం ఆయన న్యాయవాదుల బృందం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణను అక్కడి ఉన్నత న్యాయస్థానం జులైకి వాయిదా వేసింది. ఆంటిగ్వా వెళ్తానని ఛోక్సీ పెట్టుకున్న అభ్యర్థనకు విచారణార్హత లేదని పేర్కొంది. ఆయన పారిపోయే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. ప్రస్తుతం ఛోక్సీ పోలీసు భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రూ. 13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. 2018లో దేశం విడిచి పారిపోయిన ఛోక్సి ఆంటిగ్వాలో నివస్తున్నాడు. అయితే గత నెల 23న ఆయన ఆంటిగ్వా నుంచి అకస్మాత్తుగా అదఅశ్యమయ్యాడు. ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కాడు. ఛోక్సీని బలవంతంగా కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.