సాధారణంగా.. అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు..తమ పార్టీ ప్రబుత్వం ఏం చేస్తోంది? ప్రజలకు ఎలాంటి మేళ్లను సమకూరుస్తోంది? ఏయే పథకాలను అమలు చేస్తోంది? అనే కనీస పరిజ్ఞానం ఉండాలి.. ఉంటుందని కూడా ఆశిస్తాం. ఎందుకంటే.. ఎక్కడ ఏసభలో అయినా.. ప్రజా క్షేత్రంలో అయినా.. మీప్రభు త్వం ప్రజలకు ఏం చేస్తోంది? అనిఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రజాప్రతినిధులు.. స్కూల్లో పిల్లాడు ఎక్కం అప్పగిం చినట్టు అప్పగించే స్టేజ్‌లో ఉండాలి కాబట్టి!
గతంలో ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ,, గత కొన్నేళ్లుగా.. ప్రభుత్వ పార్టీకే చెందిన ప్రజాప్రతినిధులకు .. ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఎలాంటి పట్టు ఉండడం లేదు. దీంతో వారు.. వారితోపా టు.. వారి పార్టీ కూడా అభాసుపాలవుతోంది. తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఏపీ లోని వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధీ పాల్గొనాలనని సీఎం జగన్ నిర్దేశించారు. దీంతో నాయకులు బయటకు వచ్చారు.
ప్రజల్లోకి వెళ్లారు. అయితే.. వీరికి ప్రజల నుంచి అనేక ప్రశ్నలువ చ్చాయి. తాము పడుతున్న ఇబ్బందుల ను వారు ప్రజలకు ఏకరువు పెట్టారు. దీంతో మంత్రులు.. ఎమ్మెల్యేలు ఒకింత ఇబ్బంది పడ్డారు. ఇక, జలవ నరుల మంత్రి, మాటల తూటాలు పేల్చే అంబటి రాంబాబు వ్యవహారం.. అందరికన్నా హైలెట్‌గా మారిపో యింది. ఎందుకంటే.. ప్రతిపక్షాలపై సబ్జెక్టుతో తాను విరుచుకుపడతానని.. తరచుగా చెప్పే అంబటికి.. సర్కారు అమలు చేస్తున్న కార్యక్రమాలపై సబ్జెక్ట్ లేకపోవడం.. స్పష్టమైంది.
ఏం జరిగింది?
'ఆసరా పథకం' అంటే ఏమిటి అంటూ.. మంత్రి అంబటి రాంబాబు వలంటీర్లను అడిగి తెలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రికే ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడంతో వలంటీర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. బుధవారం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో జరిగిన 'గడపగడపకు...' కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. అంబటి గోళ్లపాడులో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ క్రమంలో ఆసరా పథకం అందడం లేదని ఒక మహిళ మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో ఆసరా అంటే ఏమిటని అంటూ.. వలంటీర్లను మంత్రి ప్రశ్నించారు. దీంతో వారు మంత్రికి సదరు పథకం గురించి వివరించారు. దీంతో సదరు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని మంత్రి సూచించా రు. ఇదిలావుంటే, ప్రభుత్వ పథకాలపై అంబటి పరిజ్ఞానానికి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
నెటిజన్ల టాక్ ఏంటంటే..
దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామని పదే పదేచెప్పే.. వైసీపీ సర్కారులో పనిచేస్తున్న మంత్రి అంబటికి.. సర్కారు పథకాలపైనే అవగాహన లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయనకు పథకాల గురించి కూడా తెలియదా? అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అంతేకాదు.. కనీసం తమ సొంత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి అవగాహన లేని మంత్రికి.. ప్రభుత్వం చేపడుతున్న తన శాఖ పరిధిలోనే ఉన్న.. పోలవరం ప్రాజెక్టు గురించచైనా అవగాహన ఉందా? అనే ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతుండడం గమనార్హం.