తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై గాంధీ కుటుంబం ఎలాంటి ఫీలింగ్ లో ఉంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ అధినాయకత్వం.. తమ పార్టీ నేతల పైనా అంతే కినుకుతో ఉన్నట్లుగా తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెబుతున్నారు. తాజాగా ఆయన్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మధు యాష్కీ భేటీ అయ్యారు. కర్ణాటక పీసీసీకి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపేందుకు రాహుల్ ను.. మధుయాష్కీ కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద కాంగ్రెస్ నేతలు ఎందుకు పోరాటం చేయట్లేదన్న సూటిప్రశ్నను సంధించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణ పీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించాలని చెప్పిన మధుయాష్కీ మాటకు స్పందిస్తూ.. టీ కాంగ్రెస్ విషయంలో తనకంటూ ఒక వ్యూహం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.
దాన్ని అమలు చేస్తున్నానని.. పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారట. కేసీఆర్ తీరుపై ఇటీవల కాలంలో బీజేపీ నేతలు ఒంటి కాలి మీద చెలరేగిపోతూ..ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఇరిటేట్ చేస్తున్నారు. దీంతో వారు హైలెట్ అవుతున్నారు. ఇప్పటివరకు టీ కాంగ్రెస్ నేతలకు చేతకానిది.. బీజేపీనేతలు చేత అవుతున్నది ఇదేనని చెబుతున్నారు. ఇదే అంశంపై రాహుల్ సైతం టీ కాంగ్రెస్ నేతల తీరుపై పాజిటివ్ గా లేరని చెబుతున్నారు.ఇంతకీ.. రాహుల్ తన వద్ద ఉన్న వ్యూహాన్ని ఎప్పటికి అమలు చేస్తారు?