రెండో భార్యకు ఆస్తిలో వాటా వస్తుందా?

Update: 2021-07-02 05:45 GMT
ఆస్తులు ఉంటే ఇదే గొడవ.. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు వారసులు అనుభవించడానికి.. పంచుకోవడానికి పోటీపడుతారు. ఇందుకోసం కొట్టుకు చస్తారు. కోర్టుకు ఎక్కుతారు. అయితే వారసత్వం కరెక్ట్ గా ఉంటే ఏం సమస్యలేదు. ఏమాత్రం తేడా కొట్టినా ఇదిగో ఇలాంటి దుష్పరిణామాలే ఎదురవుతాయి.

తాజాగా తండ్రి రెండో పెళ్లిని తొలి భార్య సంతానం ప్రశ్నించింది. రెండో భార్యకు, ఆమె పిల్లలకు తండ్రి సంపాదించిన ఆస్తిని చిల్లి గవ్వ ఇవ్వనని స్పష్టం చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు ఎక్కింది. సుప్రీం ఏం తేల్చలేక చట్టాలు మార్చాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించింది. ఇదో వింత కేసు.. ఆసక్తికరంగా సాగింది.

యూపీకి చెందిన ఓ హిందూ పురుషుడు 14 ఏళ్ల క్రితం ఓ ముస్లిం మహిళను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే అతడికి పెళ్లి అయ్యి సంతానం కూడా ఉన్నారు. 2015లో ఆ వ్యక్తి మరణించాడు. బోలెడు ఆస్తి ఉంది. ఈ ఆస్తి ఎవరికి రావాలి. తొలి భార్య సంతనానికా.. రెండో భార్య ముస్లిం మహిళకు పంచాలా?

దీనిపైనే తొలి భార్య సంతానం ఆసక్తి వారసత్వంపై న్యాయస్థానాన్ని 2016లో ఆశ్రయించారు. తమ తండ్రికి ముస్లిం మహిళతో జరిగిన వివాహం చెల్లదని వాదించారు. తమ సవతి తల్లి అయిన ముస్లిం మహిళను తన తండ్రిచట్టబద్దంగా పెళ్లి చేసుకోలేదని ఆరోపించారు. ఆమె తన తొలి ముస్లిం భర్తకు విడాకులు ఇవ్వకుండానే తమ తండ్రిని పెళ్లి చేసుకుందని.. అది చెల్లదని వాదించారు.

అయితే ఈ వివాహాన్ని ప్రశ్నించే హక్కు తొలి భార్య సంతానానికి లేదని ముస్లిం మహిళ తరుఫున వాదించారు. ఈ వివాహం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిందన్నారు. ఇక పెళ్లి అయిన 14 ఏళ్లకు ఈకేసు దాఖలు చేశారని.. ఆస్తి కోసమే ఇలా చేశారని వాదించారు.

అయితే ఇద్దరూ అధికారికంగానే వివాహం చేసుకున్నారు. ఈ కేసులో ముఖ్యమైన చట్టపరంగా ఇద్దరూ భార్యలే.. దీంతో భర్త చట్టబద్ద వారసులకు తమ తండ్రి రెండో వివాహం చెల్లుబాటుపై తమ వారసత్వం ప్రశ్నార్థకమవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.  చట్టబద్ద వారసులకు ఎటువంటి ఉపశమనం లేదా? అని అడిగింది..

ఈ కేసులో ఇరు పార్టీలకు నోటీసులు జారీ చేసింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వివరణను పరిశీలించాలని కోరుతూ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.
Tags:    

Similar News