టెంపుల్స్... మసీదులకు వైసీపీ సర్కార్ డబ్బులు ఇవ్వదా...?

Update: 2022-11-19 01:30 GMT
ఏపీలో వైసీపీ సర్కార్ సడెన్ గా తీసుకున్న ఒక నిర్ణయం చర్చకు కారణం అవుతోంది. ఏకంగా ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలకు ఒక్కో దానికీ కోటి రూపాయలు వంతున 175 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయిస్తూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకొనే విధంగా ఆలోచన చేస్తుంది . దీంతో ఇపుడు అది చర్చకు తావిస్తోంది.

ఏపీలో గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదు అని కూడా అంటున్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా అందరినీ సమానంగా చూసుకునేవారు. అలాగే అన్ని మతాలకు సమానమైన అవకాశాలు కల్పించేవారు. వైసీపీ కూడా నిన్నటిదాకా ఇలాగే బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసింది. అయితే ఒక్కసారిగా ఒక మతానికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా నిధులను తెచ్చి కుమ్మరించడంతోనే విమర్శలు వచ్చి పడుతున్నాయి.

ఈ మొత్తం 175 కోట్ల రూపాయలతో ఏపీలో చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనుల కోసం చేసేందుకు కేటాయించారు అని అంటున్నారు. ఇలా ఈ నిధులను గ్రనట్ ఇన్ ఎయిడ్ విధానంలో అందించడం జరగబోతుంది . ఇక ఈ నిధుల విషయం ఖర్చు తీసుకుంటే స్థానిక ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్లు ప్రతిపాదనలు స్వీకరిస్తారు. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన రాష్ట్ర క్రైస్తవ ఆర్ధిక సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది.

ఇలా వచ్చిన నిధులతో కొత్త చర్చిలను నిర్మించుకోవచ్చు. పాత వాటికి రిపేర్లు చేసుకోవచ్చు. అలాగే శ్మశాన వాటికలను బాగు చేసుకోవచ్చు. వాటిని కొత్తగా నిర్మించుకోవచ్చు. ఇంతలా బల్క్ అమౌంట్ కేటాయించడం పట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.  ఏపీలో దేవాలయాలు ఎన్నో పాడుపడి ఉన్నాయి. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలు ఉన్నాయి.

నిజం చెప్పాలంటే హిందూ దేవాలయాలకు హుండీ పెట్టి మరీ డబ్బులు భత్కుల నుంచి వచ్చిన దాని తీసుకుంటారు. దానితో ఏకంగా ఒక శాఖనే నడుపుతున్నారు. వారి జీత భత్యాలు అన్నీ కూడా ఇందులోనే వెళ్తున్నాయి. పైగా అందులో ప్రభుత్వ జోక్యం కూడా ఎక్కువ అవుతోంది అని చాలా కాలంగా హిందూ సంస్థలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి.

దాంతో ఇపుడు హిందూ దేవాలయాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పాడైన గుళ్ళూ గోపురాలకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. అలాగే హిందూ శ్మశాన వాటికలు కూడా శిధిలావస్థలో ఉన్నాయని వాటికి సైతం నిధులు ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఇక ముస్లిం మైనార్టీల విషయం తీసుకుంటే వారు కూడా తమ మసీదుల అభివృద్ధిని నిధులు ప్రభుత్వం కేటాయిస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఏది ఏమైనా అతి పెద్ద మొత్తం ఇపుడు క్రైస్తవ చర్చిలకు కేటాయించడంతో మా సంగతేంటి అని మిగిలిన వారు కూడా కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి బదులిస్తుందో చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News