కోహ్లీ ఒక్క దెబ్బకే ఇలా మారిపోయాడు..!

Update: 2019-08-25 07:52 GMT
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు మగడు అంటాడు ఓ సినిమాలో ఎంఎస్ నారాయణ. ఎంత దూకుడుగా ఉన్నా అది అన్ని చోట్ల వర్కవుట్ అవుతుందో తెలియదు.. విజయాలు సాధించినన్నీ రోజులు దూకుడు మేలే చేస్తుంది.. అపజయం ఎదురైతే మాత్రం దూకుడే కొంప ముంచిందంటారు.

ప్రపంచకప్ లో సెమీస్ లో భారత ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ పై విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లీని పీకేసి రోహిత్ కు పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. అందుకే ఇక కోహ్లీ కూడా తన మనస్తత్వాన్ని మార్చుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు వెస్టిండీస్ పర్యటన సాక్షిగా బయటపడింది.

తాజాగా వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూములో ఉన్న కోహ్లీ ఓ పుస్తకాన్ని సీరియస్ గా చదువుతూ కనిపించడం విశేషం. ఇప్పుడా ఫొటో వైరల్ అయ్యింది.. ఎందుకంటే కోహ్లీ చదువుతున్న పుస్తకం పేరు ‘డిటాక్స్ యువర్ ఇగో-7 ఈజీ స్టెప్స్ టు అచీవింగ్ ఫ్రీడం, హ్యాపినెస్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్’’.  అంటే మీలోని ఇగోను పారద్రోలితే జీవితమంతా స్వేచ్చగా సంతోషంతో విజయం సొంతమవుతుందని అర్థం.

ఇప్పుడు ఫొటో చూశాక నెటిజన్లు ఒకటే కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ దూకుడును తగ్గించుకునేందుకు అహాన్ని వీడడానికి ఇలాంటి పుస్తకం చదువుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. తనలోని అహాన్ని తగ్గించుకోవడానికి ఈ పుస్తకమే మార్గమనుకున్నాడని కొందరంటున్నారు. ఎప్పుడూ బిజీగా క్రికెట్ ఆలోచనలు చేసే కోహ్లీ ఇలా పుస్తకం పట్టేసరికి అందరూ తలో వాదనను తెరపైకి తెస్తున్నారు.. చూడాలి మరీ కోహ్లీ నిజంగా మార్పు కోసమే పుస్తకం పట్టాడా.? లేదా అనేది..
    

Tags:    

Similar News