షర్మిలపై పెంపుడు కుక్క దాడి: 25 కుట్లు

Update: 2015-08-19 12:37 GMT
అల్లారు ముద్దుగా పెంచుకునే వారి పెంపుడు కుక్కు కోపం ఎందుకు వ‌చ్చిందో కానీ.. క‌ల‌లో ఊహించ‌ని విధంగా వ్య‌వ‌హ‌రించి భ‌య‌పెట్టేసింది. ఈ ఉదంతం విన్న వారికి సైతం ఒళ్లు జ‌ల‌ద‌రించే వైనం.. మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన అధిప‌తి రాజ్ ఠాక్రే ఇంట చోటు చేసుకుంది.

రాజ్ ఠాక్రే ఇంట రెండు పెంపుడు కుక్క‌లున్నాయి. వాటిల్లో ఒక‌దానిపేరు జేమ్స్ అయితే.. రెండో దాని పేరు బాండ్‌. మంగ‌ళ‌వారం బాండ్ అనే కుక్క‌కు ఏం క‌ష్టం వ‌చ్చిందో కానీ.. ఒక్క‌సారిగా రాజ్ ఠాక్రే భార్య మీద దాడి చేసింది.

గ్రేట్ డేన్ జాతికి చెందిన ఈ కుక్క బ‌లంగా దాడి చేయ‌టం.. అది కూడా ముఖం మీద దాని దంతాలు వాడిగా ప‌డ‌టంతో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అప్ప‌టిక‌ప్పుడు ముంబ‌యిలోని హిందుజా ఆసుప‌త్రికి తీసుకెళ్లి స‌ర్జ‌రీ చేశారు.

మొత్తం ఆమె ముఖం మీద 65 కుట్లు ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ఆమె ముఖానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని.. నెమ్మ‌దిగా కోలుకుంటున్నారు. కుక్క ఆమె మీద దాడి చేసిన స‌మ‌యంలో రాజ్‌ ఠాక్రే ఇంట్లోనే మీడియాతో మాట్లాడుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకునే ఆ కుక్క‌కు అంత కోపం ఎందుకు వ‌చ్చిందో..?
Tags:    

Similar News