యజమాని ఆత్మహత్య చేసుకున్న చోటునే.. కుక్క ..?

Update: 2020-06-09 11:39 GMT
కుక్కలు ఎంతో విశ్వాసం తో ఉంటాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకానొక సమయంలో మనుషులు చూపించనంత ప్రేమ ను కూడా కుక్కలు మనుషులు పైకి చూపిస్తూ వుంటాయి. ఇక ప్రస్తుతం ఎంతో అల్లారు ముద్దుగా సొంత బిడ్డలే అన్నట్టుగా ఎంతోమంది కుక్కలను కూడా పెంచుకుంటారు అనే విషయం తెలిసిందేకక్కలను నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. కుక్కకి ఉన్న విశ్వాసం మనిషికి ఉండదు అని చెప్తుంటారు. అది నిజమే .. అలాంటి సంఘటనే మరోకటి చైనాలోని వుహాన్‌లో చోటుచేసుకుంది.

తన యజమాని ఆత్మహత్య చేసుకున్నచోటే కుక్క రోజుల తరబడి ఎదురుచూస్తోంది. తన పెంపుడు కుక్క ఎదుటే మే 30న వుహాన్‌లోని యాంగ్జీ వంతెనపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి తన యజమాని తిరిగొస్తాడని శునకం అక్కడే ఎదురు చూస్తోంది. ఈ కుక్కని గమనించిన క్సూ అనే వ్యక్తి పెంచుకోవాలని తనతోపాటూ తీసుకెళ్లినా అది తప్పించుకుపోయింది.

తన యజమాని కోసం శునకం ఎదురు చూస్తుండగా క్సూ తీసిన ఫోటోలు సామాజిక సోషల్ మీడియా లో వైరల్‌ అవుతున్నాయి. ‘మనిషి జీవితం చాలా విలువైంది. మీ కోసం జీవిత కాలం ఎదురు చూసే వారుంటారు. దయ చేసి ఆత్మహత్య చేసుకోకండి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే వుహాన్‌ లోనే ఓ వ్యక్తి వైరస్ సోకి మృతిచెందగా, బేవో అనే శునకం తన యజమాని ఇంకా తిరిగి రాడు అని తెలియక మూడు నెలలుగా ఆసుపత్రిలోనే నిరీక్షించింది. ఈ ఘటన అందరి హృదయాలను కదిలించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News