ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అనే సామెతను ప్రతి ఒక్కరు వినే ఉండి ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒక ఊరిలో ఘనంగా కుక్కల పెళ్ళి జరుగగా అక్కడ హడావుడి మాత్రం మనషులదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ లోని పాలం విహార్ జిలే సింగ్ కాలనీలో సవిత.. మణిత అనే ఇద్దరు మహిళలు ఇరుగు పొరుగు ఇంట్లో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. సవిత భర్త ప్రతి రోజు గుడికి వెళ్లి సమీపంలో ఉండే కుక్కలకు ఆహారం అందించేవాడు. ఈ క్రమంలోనే ఒక రోజు అతడిని వెంబడిస్తూ ఒక ఆడ కుక్క సవిత ఇంటికి చేరుకుంది. వీరికి పిల్లలు లేకపోవడంతో ఆ కుక్కను ఆ దంపతులు చేరదీశారు. దానికి స్వీటీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు.
ఇక వీరి ఇంటి పక్కనే ఉన్న మణిత అనే మహిళ ఇంట్లో ఒక మగ కుక్క ఉంది. దీని పేరు షేరు. వీరు కూడా ఆ కుక్కను తమ కొడుకుగా భావించి ఎనిమిదేళ్లుగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సవిత మణిత ఇంటికి వెళ్లి రెండు కుక్కలకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తెలియజేసింది. దీనికి మణిత సైతం ఆసక్తి చూపించడంతో కుక్కల పెళ్లి సందడి మొదలైంది.
అనుకున్నట్లుగానే సవిత.. మణిత కుటుంబాలు స్వీటీ (ఆడ కుక్క) షేరు (మగ కుక్క)లకు వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఏదో మొక్కబడిగా కాకుండా మనుషులు ఎలాగైతే పెళ్లి చేసుకుంటారో అచ్చం అలాగే సంప్రదాయ పద్ధతిలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లికి ఏకంగా వంద మందిని ఆహ్వానించారు. 25 పెళ్లి పత్రికలు సైతం ముద్రించారు. వీటిని కొందరు నేరుగా.. మరికొందరికీ ఆన్ లైన్లో పంపించారు.
స్వీటీ(ఆడ కుక్క).. షేరు(మగ కుక్క)లకు ఇరు కుటుంబాలు ఘనంగా పెళ్లి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల వాళ్లు అధిక సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను(కుక్కలు) ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం కుక్కలకు ఊరేగింపు(భరత్) కూడా నిర్వహించడం విశేషం.
ఈ సంఘటన చూస్తే ప్రతీ కుక్కకు ఒక రోజు వస్తుందంటే ఇదేనేమో అనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View Full View Full View