రాజకీయ నేతల మాటలు భలే చిత్రంగా ఉంటాయి. సమయానికి తగ్గట్లుగా మాట్లాడటం.. ప్రతి విషయాన్ని తమకు తగ్గట్లు అన్వయించుకొని మాట్లాడటంలో వారికి వారే సాటి. ఒకప్పుడు వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగి.. ఆయన ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించి.. ఇప్పుడు టీడీపీ నేతగా మారిపోయిన డొక్కా మాణిక్య వరప్రసాద్ మాటలు వింటే మైండ్ పోవాల్సిందే.
తమ రాజకీయ ప్రత్యర్థి రోజాపై విరుచుకుపడిన ఆయన.. తమ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ను సమర్థించిన తీరు చూస్తే డొక్కా తెలివితేటలకు మురిసిపోవాల్సిందే. రోజా సస్పెన్షన్ పై సుప్రీం చేసిన వ్యాఖ్యలకు ఏపీ అధికారపక్షం నేతలు ఒక రీతిలో.. ఏపీ విపక్ష నేతలు మరో రీతిలో రియాక్ట్ కావటం తెలిసిందే. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మాణిక్య వరప్రసాద్.. జగన్ ఎమ్మెల్యే రోజా.. తనకు నచ్చిన రీతిలో సుప్రీంకోర్టు మాటను అన్వయించుకోవటం సరికాదన్నారు.
సేవ్ డెమోక్రసీ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ర్యాలీలు నిర్వహించటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన డొక్కా.. జంప్ అయిన పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలా? వద్దా? అన్నది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతూనే.. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా ఎమ్మెల్యేలకు ఉందన్నారు. విపక్షం అన్నది లేకుండా జగన్ పార్టీకి చెందిన నేతల్ని ఒక్కొక్కరిగా లాగేసుకుంటున్న అధికారపక్షం వైఖరిని డొక్కా ఎంత ముచ్చటగా సమర్థించారో కదూ..?