తెలంగాణలో టీడీపీ నేతలు అక్కడి అధికార పార్టీ టీఆరెస్ లోకి వలసలు కడుతున్న సంగతి తెలసిందే. అయితే... విచిత్రంగా ఏపీలోనూ పాలక టీడీపీకి నుంచి నేతలు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు కొందరు. ఇటీవల ఏపీలో జరిగిన కొన్ని పరిణామాలు ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయి.
కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇప్పుడు మళ్లీ టీడీపీని వీడుతారన్న ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన తర్వాత వైఎస్ - రోశయ్య - కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత డొక్కా రాజకీయ గురువు రాయపాటి కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాయపాటే డొక్కాను టీడీపిలోకి తెచ్చారు. అయితే.... తాజాగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. ఎస్సీ వర్గీకరణపైనా, మందాకృష్ణ మాటలపైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డొక్కా ఏపీ ప్రభుత్వం తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పుల్లారావు తన శాఖ సంగతి తాను చూసుకుంటే మంచిదని.. మందా కృష్ణమాదిగ నాయకత్వంపై అపోహలు అక్కర్లేదని డొక్కా సూచించారు. మరోవైపు ప్రస్తుతానికి మందా కృష్ణకు చంద్రబాబుకు సయోధ్య లేదు. కానీ, డొక్కా మందా కృష్ణకు అనుకూలంగా మాట్లాడుతూ మంత్రులతోనే తలపడుతున్నారు.
దీంతో డొక్కా తీరును పలువురు టీడీపీ నాయకులు తప్పుపట్టారు. అధికార పార్టీలో ఉండి ఆ పార్టీ మంత్రిని విమర్శించడం..ఆ పార్టీకి ఇబ్బందులు కలిగేలా మాట్లాడడం తగదని సూచించారు. డొక్కా టీడీపీలో చేరినా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిని వదిలించుకోలేక పోతున్నారని, ఆ వాసన ఆయనలో ఇంకా పోలేదని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. టీడీపీలో ఎలా పనిచేయాలో ఆయన ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు చూసుకుంటారని దానిపై కృష్ణమాదిగ తమకు చెప్పాల్సిన పనిలేదని వర్గ గట్టిగానే డొక్కాకు కౌంటర్ ఇచ్చారు. దీంతో డొక్కాను టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ పార్టీలో ఇమడడం కష్టమని... బయటకు వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదనికూడా డొక్కా భావిస్తున్నారని... తన రాజకీయ గురువు రాయపాటి వద్ద ఇదే విషయం ఆయన ప్రస్తావించగా తొందరపడొద్దని ఆయన సూచించినట్లుగా సమాచారం.
మరోవైపు విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైనా అధికారులు కేసులు పెట్టారు. దీంతో ఆయన గన్ మెన్లను వెనక్కు పంపించి ప్రభుత్వంపై నిరసన ప్రకటించారు. అంతేకాదు... రింగురోడ్డు వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తానని ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్ కూడా బాధితుల తరఫున పోరాటానికి రెడీ అవుతున్నారు. ఈ సమయంలో వంశీ ప్రభుత్వంపై గుర్రుగా ఉండడంతో ఆయన్ను వైసీపీలోకి లాగాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
టీడీపీలో తాజా పరిణామాలను తాము సొమ్ము చేసుకోవాలని.... డొక్కా, వంశీలను తమ పార్టీ వైపు ఆకర్షించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని సమాచారం.