బాబుకు షాక్.. మండలికి డొక్కా కూడా దూరం

Update: 2020-01-21 06:44 GMT
శాసనసభలో చేతులెత్తి అమరావతిని మార్చవద్దని దండం పెట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. శాసన మండలిలో మాత్రం తనకున్న అపార బలం దృష్ట్యా మూడు రాజధానులను అడ్డుకోవాలని కలలు గన్నాడు. కానీ ఆ కలలు కల్లలయ్యే సూచనలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

ఏపీ శాసనమండలిలో టీడీపీకి 28మంది సభ్యులుండగా.. వైసీపీకి కేవలం 9మంది మాత్రమే ఉన్నారు. దీంతో శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు వీగిపోతుందని.. తన బలాన్ని చూపిస్తానని బాబు తాపత్రాయపడ్డారు.

కానీ తాజాగా 12 మంది టీడీపీ ఎమ్మెల్సీలు సభకు దూరం కావడం షాకింగ్ లా మారింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంతో సన్నిహితుడైన డొక్కా మణిక్యవరప్రసాద్ కూడా తాజాగా షాకివ్వడం గమనార్హం.

శాసన మండలి సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మణిక్యవరప్రసాద్ హాజరు కాలేదు.  ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు టీడీపీ నేతలు నుంచి ఫోన్  చేసి ఆరాతీశారట.. అయితే ఆయన తనకు ఆరోగ్యం బాగా లేక సభకు రాలేదన్న సమాధానమిచ్చారట.. సాయంత్రం లోగా సభకు  హాజరవుతా అని టీడీపీ నేతలు కు  డొక్కా చెప్పినట్టు తెలిసింది. డొక్కా రాకపోవడం వెనుక వైసీపీ హస్తం ఉందా? లేక నిజంగానే ఆరోగ్య సమస్యలా అన్నది అంతుబట్టక టీడీపీ శిబిరం మల్లగుల్లాలు పడుతోందట.
Tags:    

Similar News