అసందర్భ ఆరోపణలు - వేధింపులు చేస్తే ఎలా ఇబ్బంది పడతారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు తెలిసివచ్చింది. అసలే నోటి దురుసు ఎక్కువ ఉన్న ట్రంప్ తనపై ఒక్క నెగెటివ్ ప్రచారం జరిగే సరికి తట్టుకోలేకపోయాడు. సుదీర్ఘ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. రష్యాతో ట్రంప్ బృందానికి గల సంబంధాలపై ఎఫ్ బీఐ విచారణను అధ్యక్షుడు ప్రభావితం చేశారని సెనెట్ ముందు ఎఫ్ బీఐ డైరెక్టర్ గా పనిచేసిన జేమ్స్ కోమే వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ తో తన పరువు గంగపాలు చేసిందని భావించిన ట్రంప్ నిప్పులు తొక్కారు. సెనెట్ విచారణ బృందం ముందు జేమ్స్ కోమే చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెనెట్ ముందు జేమ్స్ విచారణ అనంతరం ట్రంప్ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ బీఐ డైరెక్టర్ గా జేమ్స్ కోమే ప్రభుత్వ రహస్యాలన్నీ లీక్ చేసేవాడని, ఇప్పుడు సెనెట్ ముందుకొచ్చి తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని ట్రంప్ విమర్శించారు. తనతో సమావేశమైన ప్రతీ సమావేశ వివరాలు రాసుకోవటం, వాటిని మీడియాకు లీక్ చేయటం చేసేవాడని, అతనో పెద్ద లీక్ వీరుడని ట్రంప్ ఆరోపించారు. ఇంతటితో సరిపుచ్చకుండా సెనెట్ విచారణ బృందం ముందు కోమే చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ ట్రంప్ తరఫు న్యాయవాది ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/