అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో తన ఫోన్ ను అప్పటి దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. అయితే దీనికి సరైన ఆధారాలను ఆయన వెల్లడించలేదు. తన ఫోన్ ను ఒబామా ట్యాప్ చేసినట్లు ట్రంప్ సంచలన ట్వీట్ చేస్తూ గత ఏడాది దేశాధ్యక్ష ఎన్నికలకు ఒక నెల ముందు ఈ ఘటన జరిగినట్లు ప్రస్తుత అధ్యక్షుడు తెలిపారు. ట్రంప్ టవర్ లో ఉన్న తన ఫోన్ ను అప్పటి అధ్యక్షుడు ఒబామా ట్యాపింగ్ చేయించినట్లు ట్రంప్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చినట్లు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ‘ఎన్నికలకు కొద్ది కాలం ముందు అంటే అక్టోబరులో నా ఫోన్ ను అధ్యక్షుడు ఒబామా ట్యాపింగ్ చేయించారన్న అంశం నుంచి మంచి న్యాయవాది అద్భుతమైన కేసును రాబట్టగలరని పందెం కాస్తున్నాను’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ‘‘అత్యంత పవిత్రమైన ఎన్నికల ప్రక్రియ జరుగుతూండగా నా ఫోన్లను ట్యాప్ చేసేవిధంగా ప్రెసిడెంట్ ఒబామా ఎంతగా దిగజారారు. బ్యాడ్/సిక్ గై’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
కాగా, ట్రంప్ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అధ్యక్ష పదవి చివరి రోజుల్లో ఒబామా చేసిన చర్యలపై చట్టసభల సభ్యులతో విచారణ చేపట్టాలని ఓ కన్జర్వేటివ్ నేత డిమాండ్ చేశారు. రిపబ్లికన్ నేత ఎటువంటి తప్పు చేయకున్నా, ఎన్నికల సమయంలో ఆయన ప్రచార అంశాలను ట్యాప్ చేసినట్లు ఒబామాపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా దానికి ట్రంప్ వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయింది.
ఇదిలాఉండగా... మన దేశంలో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో ఉందని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న జయశంకర్ అక్కడి సీనియర్ కేబినెట్ సభ్యులు, ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం అనంతరం ఈ విషయం స్పష్టం చేశారు. భారత్ తో సంబంధాల బలోపేతానికి ట్రంప్ యంత్రాంగం ఆసక్తి కనబరుస్తోందన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ప్రారంభమైన ఇండో-అమెరికా వ్యూహ్యాత్మక చర్చలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయని వెల్లడించారు. ఈ చర్చల కోసం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్, కామర్స్ సెక్రటరీ రోస్ భారత్ పర్యటనకు రానున్నారని, పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉందన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన జయశంకర్ పలువురు కీలక అధికారులను కలిశారు. పర్యటనలో భాగంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ టిల్లర్సన్ - కామర్స్ సెక్రటరీ రోస్ - సెక్రటరీ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యురిటీ జనరల్(రిటైర్డ్) జాన్ కెల్లితో పాటు అమెరికాలో భారతీయుల భద్రతపై అక్కడి జాతీయ భద్రత సలహాదారుతోనూ సమావేశమయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/