అమెరికా అధ్యక్ష అభ్యర్థులు హిల్లరీ క్లింటన్ - డోనాల్డ్ ట్రంప్ వాదోపవాదాలతో సృష్టిస్తున్న కలకలం మామూలుగా లేదు. ఈనెల 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కానీ ఈ బలమైన ప్రత్యర్థులు ఒకప్పుడు మంచి స్నేహితులే! తాజాగా వెలువడిన ఓ అరుదైన ఫోటో దీన్ని నిజం చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ప్రజలు ఆ ఫోటోతో షాక్ అవుతున్నారు.
స్వతహాగా వ్యాపారవేత్త అయిన డోనాల్డ్ ట్రంప్ 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు జరిగిన వెడ్డింగ్ రిషెప్షన్ కు క్లింటన్ దంపతులు హాజరయ్యారు. ఆ వేడుకల్లో ఈ రెండు జంటలు సరదాగా గడిపాయి. ముచ్చట్లు - నవ్వుల్లో మునిగిపోయారు. తాజాగా వెలువడిన ఫోటోలో ఆ వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు గతంలో ట్రంప్ దేశాధ్యక్షులతో లింకులు పెట్టుకునేవారు. ఆ సందర్భంలోనే బిల్ తో దోస్తీ కట్టారు. అందుకే పెళ్లి విందుకు బిల్ ను ఆహ్వానించారు. ఆ పార్టీకి హిల్లరీతో వచ్చారు బిల్. అంతేకాదు - ఆ ఊపులోనే ఓ దశలో క్లింటన్ ఫౌండేషన్‌కు ట్రంప్ భారీ విరాళాన్ని కూడా ప్రకటించారు. క్లింటన్ ఫౌండేషన్ కు లక్ష డాలర్లు ట్రంప్ గిఫ్ట్ ఇచ్చారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హిల్లరీ - ట్రంప్ ఒకప్పుడు స్నేహితులే అన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్నా - ఇప్పుడు మాత్రం దేశాధ్యక్ష రేసుకు ప్రధాన ప్రత్యర్థులుగా మారారు. పవర్ పాలిటిక్స్ కోసం హిల్లరీ - ట్రంప్ ఇప్పుడు అమెరికా ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా హిల్లరీ - రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ తీవ్రంగా పోటీపడుతున్నారు. కానీ ఈ ఇద్దరూ ఇప్పటికే ఒకరిపై ఒకరు చాలా హేయమైన ఆరోపణలు చేసుకున్నారు. ఇదిలాఉండగా ట్రంప్ కు చెందిన మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. ట్రంప్ తన పార్టీ సభ్యత్వాన్ని గతంలో ఏడు సార్లు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ - డెమోక్రటిక్ - ఇండిపెండెంట్ పార్టీల్లో ట్రంప్ సభ్యత్వాన్ని మారుస్తూ వచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/