యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భేటీ ముగిసింది. ఆర్నెల్ల క్రితం అగ్రరాజ్యమైన అమెరికాను మాడి మసి చేస్తానని.. అమెరికన్లు ఎప్పుడూ చూడని హింసను తాను చూపిస్తానని చెప్పటమే కాదు.. తాను ప్రయోగించే అణ్వస్త్రాలతో అమెరికా ఎంతలా భస్మీపటలం అవుతుందన్న విషయాన్ని గ్రాఫిక్ వీడియోల ద్వారా ప్రదర్శించి మరీ అమెరికన్లలో వణుకు తెప్పించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. దీనికి తగ్గట్లే ట్రంప్ సైతం చెలరేగిపోయారు. అమెరికా ఆయుధ శక్తిని ఉత్తరకొరియా తట్టుకోలేదంటూ ధీటుగా సమాధానం ఇచ్చినా.. ఇరు దేశాల మధ్య వైరం ప్రపంచానికి మరెలాంటి ఉత్పాతాన్ని తీసుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే.. అందుకు భిన్నంగా ఈ రెండు దేశాధినేతల మధ్య చారిత్రక సమావేశానికి రంగం సిద్ధమైంది. ఈ సమావేశం జరిగే వరకూ బోలెడంత చర్చ సాగింది. అనుకున్నట్లే ఇరువురి మధ్య సమావేశం జరిగింది. అద్భుతమైన ఫలితాలు రాకున్నా.. రెండు భిన్న ధ్రువాలు ఒకచోటుకు చేరి.. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.
ఇరువురు స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నించారు. తమ మధ్య స్నేహం ప్రపంచానికి కొత్త కాంతిగా ఇరువురు నేతలు వ్యవహరించటం కనిపించింది.
దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంత చర్చలతో పాటు.. దాదాపు నాలుగు గంటలకు పైనే సాగిన భేటీ అనంతరంఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన చేశారు. ట్రంప్.. కిమ్ భేటీ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాల్ని వెల్లడించారు. ఇరు దేశాధినేతల మధ్య సాగిన సమావేశంతో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని.. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడినట్లుగా పేర్కొన్నారు. ట్రంప్.. కిమ్ లు ఇద్దరు కలిసి విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలోని అంశాల్ని చూస్తే..
= కొరియా ద్వీపకల్పంలో శాంతి - సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం.
= శాంతి, సుస్థిరత కోసం రెండు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య బంధం బలపడే చర్యలకు కట్టుబడి ఉండడం.
= ఈ ఏడాది ఏప్రిల్ 27న ఉత్తర కొరియా తాను చేసిన అణునిరాయుధీకరణ ప్రకటనకు కట్టుబడి ఉండటం, సంపూర్ణ అణునిరాయుధీకరణ జరిగేలా కిమ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం.
= యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధం సమయంలో ఆచూకీ తెలియకుండా పోయిన వారిని గుర్తిస్తే వారిని తిరిగి తమ తమ దేశాలకు అప్పగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండటం.
= తాజాగా నెలకొన్న సానుకూల దృక్పథాన్ని కొనసాగించటానికి విదేశాంగ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారుల స్థాయిలో వీలైనంత త్వరగా చర్చలు జరపడం.
= సైనిక విన్యాసాల్ని నిలిపివేసి..ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా హామీ
= దీనికి ప్రతిగా ఉత్తర కొరియా ఎలాంటి క్షిపణి పరీక్షలు జరపదు