ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. అంచనాలకు మించిన గౌరవ మర్యాదల్ని ఆయన పొందుతున్నారు. వివాదాస్పద అధ్యక్షులుగా విమర్శలు ఎదుర్కొంటూ... దురుసు వైఖరితో తరచూ వార్తల్లోకి ఎక్కే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీకి రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇరువురు ప్రముఖుల భేటీని చూసినప్పుడు.. ఇరువురి మధ్య అనుబంధం మరింత పెరిగినట్లుగా కనిపించక మానదు. అన్నింటికి మించి 20 నిమిషాల ఏకాంత భేటీ అనంతరం మోడీ.. ట్రంప్ ల మధ్య అనుబంధం మరింత బలపడినట్లుగా కనిపించింది. రెడ్ కార్పెట్ పరిచి మోడీకి ట్రంప్ దంపతులు ఘన స్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య భేటీని ఒక్క మాటలో చెప్పాలంటే.. మూడు షేక్ హ్యాండ్లు.. ఒక బిగ్ హగ్ అని చెప్పాలి.
ఇరువురు మర్యాదగా.. స్నేహపూర్వకంగా షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని.. చివరకు కౌగిలింతల వరకూ వెళ్లటం చూస్తే.. మోడీ.. ట్రంప్ ల మధ్య దోస్తానా పీక్స్ కు వెళ్లినట్లుగా చెప్పక తప్పదు. అదే విషయాన్ని ట్రంప్ తన ప్రకటనలో ప్రస్తావించటం గమనార్హం. ఇక.. వైట్ హౌస్ కు వెళ్లిన మోడీకి ట్రంప్ ఎలాంటి వెల్ కం చెప్పారన్నది చూస్తే..
వైట్ హౌస్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి స్వాగతం చెప్పేందుకు కారు వద్దకు ట్రంప్.. మెలానియాలు వచ్చారు. కారు దిగిన మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్ ఆయన్ను సాదరంగా లోపలికి ఆహ్వానించారు. అనంతరం ఇరువురు నేతలు 20 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. మీటింగ్ తర్వాత ఇరువురు నేతల మధ్య బంధం మరింత బలపడినట్లుగా వారి బాడీ లాంగ్వేజ్ చెప్పింది.
ఏకాంత సమావేశం తర్వాత ఇరువురు నేతల సంయుక్త ప్రకటన సైతం.. ఇరువురు నేతల మధ్య సంబంధాల్ని స్పష్టం చేసేలా సాగింది. సంయుక్త ప్రకటనలో భాగంగా తన ప్రసంగం ముగిసిన తర్వాత ట్రంప్.. మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక అడుగు ముందుకేసిన మోడీ.. తనదైన అప్యాయతను ప్రదర్శిస్తూ హగ్ చేసుకున్నారు. దీనికి ట్రంప్ సానుకూలంగా స్పందించారు. అనంతరం తన ప్రసంగం పూర్తి చేసిన తర్వాత మరోసారి ఇరువురు నేతలు మరోమారు హగ్ చేసుకున్నారు. ఇలా రెండు షేక్ హ్యాండ్లు.. మరో రెండు బిగ్ హగ్స్ తో వీరి భేటీ ముగిసిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/