ట్రంప్ కంపు నోరు మీడియాను టార్గెట్ చేసింది

Update: 2016-06-01 09:36 GMT
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే కంపు ట్రంప్ గురించి అందరికి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఆయన నోటి బారిన పడనోళ్లు ఎవరూ ఉండరనే చెప్పాలి. దేశాల మీదనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన. .ఇప్పటికే పలు వర్గాల వారి మనసుల్ని గాయపరిచారు. తాజాగా ఆయన మీడియా మీద కూడా విరుచుకుపడ్డారు.

మీడియా విశ్వసనీయతను ప్రశ్నించటమే కాదు. ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మీడియాకు నిజాయితీ లేదని.. ఇకపై కూడా తాను మీడియా మీద దాడి చేస్తానని తేల్చి చెప్పిన ట్రంప్.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇంతకీ ట్రంప్ కు మీడియా మీద అంత కోపం ఎందుకు వచ్చిందంటే.. ఆయన సేకరించిన నిధుల సేకరణ.. వాటి ఖర్చులకు సంబంధించి జమాలెక్కలపై ప్రశ్నలు సంధించటంలో ఆయనకు కాలిపోయింది. ట్రంప్ సేకరించిన ఆరు మిలియన్ డాలర్ల లెక్కపై ప్రశ్నలు సంధించగానే ఆయనకు కోపం రావటమే కాదు.. మంచి పనులు చేస్తున్నా తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. తాను భవిష్యత్తులో కూడా మీడియా దాడి చేస్తానంటూ బహిరంగంగానే తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. ఏబీసీ ఛానల్ కు చెందిన జర్నలిస్ట్ టామ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అతడిపై ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు.
Tags:    

Similar News