ఎప్పుడో పాతరోజుల్లోనూ, సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎన్నికల రిగ్గింగులు జరిగాయనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే టెక్నాలజీ ఇంతగా పెరిగింది, పోలీస్ వ్యవస్థ బలపడింది, జనాలు కూడా అంతా చదువుకున్నవారు, విజ్ఞత తెలిసిన వారు ఉంటున్న ఈ రోజుల్లో కూడా అలాంటి సంఘటనలు జరుగుతాయా అంటే మిగిలిన ప్రాంతాల సంగతి తెలియదు కానీ అమెరికాలో మాత్రం జరుగుతాయట. ఇదేమిటి అగ్రరాజ్యం లో కూడా ఇలాంటి సంక్సృతి ఉందా? అనుకునేవారికి క్లారిటీ ఇస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన ట్రంప్... ఈ ఎన్నికల్లో కచ్చితంగా రిగ్గింగ్ జరుగుతోందని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల ముందు అమెరికా గౌరవాన్ని పెంచుతాయా.. తగ్గిస్తాయా అనే విషయం కాసేపు పక్కనపెడితే ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమవనున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు.
అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎన్నికల ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పోటీని తట్టుకోలేక ప్రత్యర్థిపార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడుతున్నాయని, నవంబర్ 8న సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. ఈ విషయాలపై ఓటమికి కావాల్సిన కారణాలను ట్రంప్ ఇప్పటినుంచే వెతికి పెట్టుకుంటున్నారని ప్రత్యర్ధులు విమర్శిస్తుంటే... ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ తమ పార్టీ అభ్యర్థి ట్రంప్ వాటిని అంగీకరిస్తారని ట్రంప్ సహచరుడు, ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్ పెన్స్ అంటున్నారు.
అయితే... ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని నమ్ముతున్నట్లు హిల్లరీ చెప్పడం, ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున జనం కదులుతారని, తద్వారా ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుందని ఆమె వ్యాఖ్యానించడంపై కూడా స్పందించిన ట్రంప్... రిగ్గింగ్ అవకాశాలను బట్టే ఆమె అలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో హిల్లరీకి మీడియా తన వికృతరూపాన్ని సంతరించుకుని సాయం చేస్తోందని, వైట్ హౌస్ కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గత నాలుగైదు దఫాలుగా సాగిన ఓటింగ్ శాతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..
2012 - 57.5 శాతం
2008 - 62.3 శాతం
2004 - 60.4 శాతం
2000 - 54.2 శాతం
అయితే ఈ ఏడాది మాత్రం మునుపెన్నడూలేని విధంగా ప్రజలు ఓటింగ్ లో పాల్గొంటారని అభిప్రాయాలు వ్యకతమవుతున్నాయి. ఈ విషయాలు మరో 20 రోజుల్లో తేలిపోనున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/