తనకెందుకు ఓటేయాలో చెబుతున్న ట్రంప్

Update: 2016-11-03 15:32 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ కు రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ నెల ఎనిమిదిన.. అంటే కేవలం మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి రేసులోఉన్న అభ్యర్థులు ఇద్దరూ ఒకరికి మించి మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్ కు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని హిల్లరీకి తోడుగా.. అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం గళం విప్పిన వేళ.. ట్రంప్ అందుకు ధీటుగా తన వాదనను వినిపిస్తున్నారు.

అమెరికన్లు తనకే ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హిల్లరీ కానీ అమెరికా అధ్యక్షురాలు కానీ అయితే.. మరో నాలుగేళ్లు ఒబామా పాలనే కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికా అది భరించలేదన్న ట్రంప్.. అమెరికన్లు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. మధ్య ప్రాచ్య దేశాల్లో యుద్ధంపై అమెరికా ఆరు ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని.. ఇందులో విజయం ఉండకపోగా.. ముగింపు కూడా ఉండదని వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పుడు అక్కడ దారుణ పరిస్థితి ఉంది. అమెరికా ప్రజలు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అమెరికాలోభద్రత లోపించేలా చేశారు. ఒబామా.. హిల్లరీలు అమెరికాను విదేశీ యుద్ధాల్లోకి లాగారు. అహెరికాలో భద్రత లోపించేలా చేశారు’’ అని తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి అమెరికన్ల భవిష్యత్తు బాగుండటం కోసం తాను కృషి చేస్తానని చెప్పినట్రంప్.. తనకు మాత్రమే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరి.. ఆయన మాటలకు అమెరికన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News