రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్ తో బాగ్దాదీ హతం కావటం తెలిసిందే. అయితే.. ఎలా చనిపోయాడన్న విషయం తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఐసిస్ ను ఏర్పాటు చేసిన ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఎందరో మహిళలు.. పిల్లల ఉసురు తీసుకున్న దుర్మార్గుడి మరణం అత్యంత దారుణంగా సాగినట్లుగా తెలుస్తోంది.
తమ దళాలు నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ లో ఇస్లామిక్ స్టేట్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీ మరణించినట్లుగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్.. అతడి చావును కుక్కచావు చచ్చినట్లుగా అభివర్ణించారు. పక్కాగా అందిన సమాచారంతో అతనున్న నివాసంపై మెరుపుదాడి చేసిన అమెరికా దళాలకు దొరక్కుండా ఉండేందుకు వీలుగా.. తను.. తన భార్య బాంబుల్ని చుట్టుకొని తమను తాము పేల్చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ ఉదంతంలో అతని ముగ్గురు పిల్లలు చనిపోయారని.. అమెరికా సైనికులకు ఎలాంటి హాని జరగలేదన్నారు.
అమెరికా దళాలు దాడి చేసిన సమయంలో బాగ్దాదీ సొరంగంలో దాక్కున్నట్లుగా చెబుతున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆపరేషన్ జరగ్గా.. చివరకూ అత్యంత దారుణంగా అతని ముగింపు సాగినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే బాగ్దాదీ మరణం.. నిండైన దు:ఖంతో.. భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన ఆయన.. అమెరికా దళాల్ని ఎదుర్కొనే ధైర్యం లేక భయంతో తనను తాను బాంబులు చుట్టేసుకొని పేల్చేసుకున్నాడని చెప్పారు. పేలుడు ధాటికి బాగ్దాదీ శరీరం తునాతునకలైందని.. డీఎన్ఏ టెస్టులు నిర్వహించి అతడు చనిపోయినట్లు నిర్దారించినట్లు పేర్కొన్నాడు.
ప్రపంచానికి పట్టిన పీడగా అభివర్ణించే బాగ్దాదీ లాంటి కసాయి.. అమెరికా దళాలకు తాను చిక్కకూడదన్న ఉద్దేశంతో మరణించిన తీరుపై దిగ్భాంత్రి వ్యక్తమవుతోంది. తన ప్రత్యర్థులకు దారుణమైన రీతిలో శిక్షలు వేసే బాగ్దాదీ గ్యాంగ్ కు తగ్గట్లే.. అతగాడి చావు కూడా ఉందని చెప్పకతప్పదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లే.. ఎట్టకేలకు బాగ్దాదీ కుక్కచావు చచ్చాడనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పక తప్పదు.