అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్ పై నోరు పారేసుకున్నారు. అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ పారిస్ వాతావరణ ఒప్పందాన్ని తప్పు పట్టారు. ఇది ఏకపక్షమని ఆరోపించారు. గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తి తగ్గింపునకు భారత్ - చైనా - రష్యా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ``అమెరికా డబ్బులు ఖర్చు చేస్తోంది. ఆర్థిక భారం మోస్తోంది. కానీ లాభం విదేశాలు పొందుతున్నాయి. అలాంటిదే పారిస్ వాతావరణ ఒప్పందం. వచ్చే రెండు వారాల్లో పారిస్ ఒప్పందంపై అతిపెద్ద నిర్ణయం తీసుకోనున్నాం. ఏమి జరుగబోతుందో చూద్దాం`` అని అన్నారు.
మరోవైపు ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ``క్షిపణి - అణుపరీక్షలు జరుపకుండా ఉత్తరకొరియాపై చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఒత్తిడి తెస్తారని భావిస్తున్నా. ఆ దేశం అణుపరీక్షలు జరుపడంపై నేను సంతోషంగా లేను. జీ జిన్ పింగ్ కూడా సంతోషంగా లేరని అనుకుంటున్నా. సైనిక చర్య గురించి నాకు తెలియదు`` అని అన్నారు. కాగా ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డారు. నిజాయితీ లేని, అసమర్థ మీడియాగా అభివర్ణించారు. ఒక్కటి తర్వాత మరొక్క హామీని నెరవేర్చుతున్నామని, తన పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ తన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మీడియా ప్రజలకు నిజాలను చెప్పడం లేదని ట్రంప్ దుయ్యబట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/