జ‌డ్డీని, కోర్టుల‌ను దులిపేసిన ట్రంప్‌

Update: 2017-02-06 10:29 GMT
ఏడు ముస్లిం దేశాల‌కు చెందిన శ‌ర‌ణార్థుల‌పై 120 రోజుల నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల‌కు జ‌డ్జి జేమ్స్ రాబ‌ర్ట్‌ అడ్డుక‌ట్ట‌ వేసిన విష‌యం తెలిసిందే. ఫెడ‌ర‌ల్‌ జ‌డ్జి జేమ్స్ రాబ‌ర్ట్‌ త‌న ఆదేశాల‌ను అడ్డుకోవ‌డాన్ని ట్రంప్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఎస్టేట్‌ లో గ‌డిపారు. ఇదే స‌మ‌యంలో ట్విట్ట‌ర్ ద్వారా జ‌డ్జి తీరును ట్రంప్‌ ఖండించారు. ఓ జ‌డ్జి దేశాన్ని ఇలా ప్ర‌మాదంలో నెట్టేస్తార‌ని ఊహించ‌డంలేద‌న్నారు. ఎవ‌రికైనా ఏదైనా జ‌రిగితే, అప్పుడు ఆ జ‌డ్జిను, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను నిందించాల‌ని ట్రంప్ త‌న ట్వీట్‌ లో విమ‌ర్శించారు. ఫ‌లానా జ‌డ్జి అంటూ గ‌తంలో ట్వీట్ చేసిన ట్రంప్ తాజాగా ఆయ‌న ఇచ్చిన తీర్పును వ్య‌తిరేకించారు. జ‌డ్జి జేమ్స్‌రాబర్ట్ తీర్పు హాస్యాస్పదమని ట్రంప్ విమర్శించారు. దేశభద్రత విషయంలో తామే గెలుస్తామని అన్నారు. 'ఉగ్రవాదులు - ఇతరులకు ఒక జడ్జి దేశద్వారాలు ఎలా తెరుస్తారు? ఇది దేశ ప్రయోజనాలకు తగినచర్య కాదు. దీనిపై దుష్టులు మాత్రమే సంతోషిస్తారు' అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ప్రవేశాలపై నిషేధం ఎత్తివేతవల్ల దుష్టులు - ప్రమాదకరమైన వ్యక్తులు దేశంలోకి ఎగబడిచొరబడుతారు.. జడ్జి తీర్పు దారుణమైనది అన్నారు.

మ‌రోవైపు అమెరికాలో రాజ్యాంగానికి, అధ్యక్ష అధికారాలకు మధ్య ఇప్పుడు ఘర్షణ తలెత్తిందని పెన్సిల్వేనియా వర్సిటీలోని మత - రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు - న్యాయవాది మర్కీ హామిల్టన్ అన్నారు. ఫెడరల్ కోర్టు ఉత్తర్వులను పాటించరాదని ట్రంప్ సూచిస్తే అది రాజ్యాంగ సంక్షోభమేనని సెనేట్ జ్యుడీషియరీ కమిటీ డెమోక్రాట్ పాట్రిక్ లీహీ అన్నారు. ట్రంప్ తాజా వైఖరిపై దేశ విదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ - వాషింగ్టన్‌ లతోపాటు - లండన్ - ప్యారిస్ - బెర్లిన్ - ఇండోనేషియా తదితర చోట్ల వేలమంది యూఎస్ దౌత్య కార్యాలయాల ఎదుట నిరసనలు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News