కంపెనీల‌కు ట్రంప్ తొలి హెచ్చ‌రిక‌

Update: 2016-12-02 17:30 GMT
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ త‌న మొద‌టి పంజా ఝులిపించారు. ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌ముందే కంపెనీల‌కు ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఉద్యోగాలను బయటి దేశాలకు ఇచ్చే కంపెనీల మీద అదనంగా 35 శాతం పన్ను విధిస్తానని ప్ర‌క‌టించిన ట్రంప్ అంత‌కు మించిన హెచ్చ‌రిక‌లు జారీచేశారు. అమెరికాలో కంపెనీ ఏర్పాటు చేసి... విదేశాల‌కు ఉద్యోగాల‌ను త‌ర‌లిస్తే తీవ్ర ప‌రిస్థితులు ఎదుర్కుంటార‌ని తేల్చిచెప్పారు. ఉద్యోగాల త‌ర‌లింపున‌కు ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్టు బ‌ద‌లాయింపు ఇలా పేరు ఏదైనా... అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు కోల్పోయే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే స‌హించేది లేద‌ని తెలిపారు.

ఇంత‌కీ ట్రంప్ ఎందుకు ఇంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారంటే... అమెరికాకు చెందిన ఏసీ తయారీ కంపెనీ అయిన క్యారియ‌ర్ పొరుగుదేశ‌మైన‌ మెక్సికోకు తరలి వెళ్లిపోయేందుకు సిద్ధ‌మైంది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న ట్రంప్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసి అమెరికాలోనే స‌ద‌రు ఉద్యోగాలు ద‌క్కేలా చేశారు. దీంతో అమెరిక‌న్ల‌కే స‌ద‌రు ఉద్యోగాలు ద‌క్కాయి. ఈ సంద‌ర్భంగానే ఉద్యోగాల క‌ల్ప‌న విష‌య‌మై ట్రంప్ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఉద్యోగాలు త‌ర‌లిస్తే స‌హించేది లేద‌ని స్ప‌స్టం చేశారు. కాగా కంపెనీలు- ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో ట్రంప్ వ్య‌వ‌హార శైలి ఏ విధంగా ఉంటుంద‌నేది ఈ ఉదంతంతోనే తేలింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News