భారత ప్రధాని నరేంద్ర మోడీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన అమెరికా అధ్యక్షుడు 24 గంటలు గడవక ముందే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో భేటీ అయ్యారు. ఇలాంటివి కొన్ని దశాబ్దాలుగా అలవాటైనవే. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు మొదలు.. ఆ దేశ విదేశాంగ మంత్రి.. ఇతర కీలక నేతలు ఎవరు భారత్ కు వచ్చినా తిరిగి వెళ్లే సమయంలో కానీ.. భారత్ కు వచ్చే ముందు కానీ ఇస్లామాబాద్ లో ల్యాండ్ అయి రావటం ఒక అలవాటు. భారత్ తో రాసుకుపూసుకు తిరిగినా.. తమకు మిత్రదేశమని చెప్పినా.. పాక్ తోనూ అగ్రరాజ్యం సన్నిహితంగా ఉండేది.
అదే ఆనవాయితీని మిస్ చేయలేదు ట్రంప్. కాకుంటే.. ఇంతకు ముందెప్పుడూ చోటు చేసుకోని పరిణామం ఈసారి చోటు చేసుకుంది. భారత ప్రధాని మోడీతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న 24గంటల వ్యవధిలోనే పాక్ ప్రధానితో భేటీ అయినప్పటికీ.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు ట్రంప్. ఇమ్రాన్ సమక్షంలో ఏ మాటలైతే ఆయనకు నచ్చవో.. ఎలాంటి తీరుతో అసహనానికి గురి అవుతారో.. అవన్నీ వరుస పెట్టి చేసేసి సంచలనంగా మారారు ట్రంప్.
న్యూయార్క్ లో ఇమ్రాన్ తనను కలిసి సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోడీని ట్రంప్ ప్రశంసించటం ఊహించిన అంశంగా చెప్పాలి. మోడీ పని తీరు అద్భుతంగా ఉందని కితాబునివ్వటంతో ఇమ్రాన్ నోట మాట రాలేదు. తీవ్రమైన అసహనానికి గురయ్యేలా చేసింది. అలా అని ట్రంప్ మాటను ఎదురు చెప్పలేని దుస్థితి. దీంతో.. తనలో తాను అసహనానికి గురి అవుతూ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు ఇమ్రాన్.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో ఇబ్బందికర పరిస్థితిని ఇమ్రాన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మోడీ పాలనను పొగిడేసిన ట్రంప్ అక్కడితో ఆగకుండా.. అమెరికా విషయంలో పాకిస్తాన్ తీరు సరిగా ఉండదన్న మాటను ఏ మాత్రం మొహమాటం లేకుండా అనేయటంతో ఇమ్రాన్ కు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితి.
ఎలాంటి సందర్భంలోనైనా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు పాక్ ప్రధానులు తీసే కశ్మీర్ అస్త్రాన్ని బయటకు తీసిన ఇమ్రాన్ కు ఈసారి చేదు అనుభవం ఎదురైంది. కశ్మీర్ పై అమెరికా మధ్యవర్తిత్వం వహించాలన్న ఇమ్రాన్ డిమాండ్ ను ట్రంప్ చెప్పేయటమే కాదు.. ఇమ్రాన్ చెంప ఛెళ్లుమనేలా సమాధానం ఇచ్చారు.
భారత్ కోరుకుంటేనే మధ్యవర్తిత్వం వహిస్తామని స్పష్టం చేయటంతో.. ఇకపై అగ్రరాజ్య అధినేత ఎదుట కశ్మీర్ అంశాన్ని తీసుకురాలేని పరిస్థితిని ట్రంప్ కల్పించారు. ఇదిలా ఉంటే.. వారం పాటు సాగనున్న మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ తో మరోసారి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని చెబుతున్నారు.
అగ్రరాజ్యం తమకు మిత్రదేశమని.. తమకు మంచి మిత్రుడనే మాటను అదే పనిగా భారత్ చెప్పుకునే దానికి భిన్నంగా ఈసారి.. అమెరికానే భారత్ కు తానెంత నమ్మకస్తుడైన మిత్రుడన్న విషయాన్ని ట్రంప్ తన తీరుతో స్పష్టం చేశారని చెప్పాలి.