ట్రంప్ కొత్త గెట‌ప్ చూశారా?

Update: 2016-07-04 22:30 GMT
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగ‌నున్న డోనాల్డ్ ట్రంప్  మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కాడు. ఈ ద‌ఫా ఆయ‌న వ‌ల్ల కాకుండా ఆయ‌న గురించి ఇత‌రులు చేసిన ప్ర‌యోగం వ‌ల్ల కావ‌డం విశేషం. మార్వెల్ కామిక్ అనే సంస్థ ట్రంప్ ను బ్యాడ్ బాయ్‌ గా చిత్రీక‌రించింది. ఆ విల‌న్‌ కు మోడాక్ అని పేరు పెట్టి మార్కెట్లోకి వ‌ద‌ల‌గా పెద్ద ఎత్తున క్రేజ్ వ‌స్తోంది.

 సూప‌ర్ విల‌న్ మోడాక్ అంటే "మెంట‌ల్ ఆర్గ‌నిజ‌మ్ డిజైన్డ్ యాస్ అమెరికాస్ కింగ్‌". ఈ కొత్త త‌ర‌హా పాత్ర‌లో కామిక్ ల‌వ‌ర్స్‌ ను ట్రంప్ థ్రిల్ చేయ‌నున్నాడు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు పోటీప‌డుతున్న ట్రంప్ రూపురేఖ‌ల‌తో ఉన్న వ్య‌క్తిని మార్వెల్ స‌ంస్థ కొత్త పుస్త‌కంలో విల‌న్ క్యారెక్ట‌ర్‌ ను డిజైన్ చేసింది. అచ్చం ట్రంప్‌ ను పోలిన ముఖం - క‌ళ్లు - వెంట్రుక‌లు - చేతులు ఆ సూప‌ర్ విల‌న్‌ లో క‌నిపిస్తున్నాయి. స్పైడ‌ర్ గెన్ సంచిక‌లో ట్రంప్ కామిక్ అవ‌తారం క‌నిపిస్తుంది. ఈ పుస్త‌కంలో ట్రంప్ ఆకారం న‌వ్వు పుట్టించ‌డం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈ గెట‌ప్‌ తో ఆయ‌న సంచ‌ల‌నం సృష్టించ‌నున్నారుని సంస్థ ప్ర‌తినిధులు చెప్తున్నారు. ఇన్నాళ్లు రెచ్చ‌గొట్టిన ట్రంప్ ఇక‌నుంచి న‌వ్వించ‌నున్నాడ‌న్న‌మాట‌.
Tags:    

Similar News