చైనాపై కోపంతో ఊగిపోయిన ట్రంప్.. ఏమన్నాడంటే?

Update: 2020-07-01 09:20 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కోపంతో ఊగిపోయారు. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య భారీగా పెరగడంపై ఆ దేశ వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారట.. కరోనా వైరస్ నియంత్రణ తమ చేతుల్లో లేదని వారు ట్రంప్ కు హెచ్చరికలు జారీ చేశారు. చేతులెత్తేశారట.. దీంతో ట్రంప్ రగిలిపోయారు.

కరోనా మహమ్మారిని ప్రపంచవ్యాప్తం చేసినందుకు.. అంతర్జాతీయంగా అతి క్లిష్ట సమస్యగా మారేందుకు చైనాయే కారణమని.. అందుకు తనకు చాలా కోపంగా ఉందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా వ్యాపిస్తోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోనే కాదు.. ఈ మహమ్మారి ప్రపంచమంతటా విధ్వంసాన్ని సృష్టించింది.  ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు. నాకు కూడా ఇదే అర్థమైందని.. దీనికంతటికి కారణమైన చైనాపై నాకు కోపం అంతకంతకూ పెరిగిపోతోందని ట్రంప్ తాజాగా ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు.

ట్రంప్ వల్లే అమెరికా, ప్రపంచం అల్లకల్లోలంగా మారిందని.. ఆ దేశాన్ని చూస్తుంటే తనకు చాలా కోపం వస్తోందని ట్రంప్ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు.
Tags:    

Similar News