నాన్న వ‌ల్ల వ్యాపారం దెబ్బ‌తింటోంది: ట్రంప్ త‌న‌యుడు

Update: 2018-02-24 04:30 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌యుడు ఆయ‌న గురించి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే ట్రంప్ నిర్ణ‌యాల గురించి కాకుండా ఆయ‌న ప‌ద‌వి గురించి అసంతృప్తి వ్య‌క్తం చేశారు.  తన తండ్రి అధ్యక్ష పదవి తమ కుటుంబ స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారానికి ప్రతికూలంగా మారిందని అమెరికన్ రియల్ ఎస్టేట్ దిగ్గజం - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ జూనియర్ వెల్లడించారు. అయితే అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత తమ తండ్రి కుటుంబ వ్యాపారంలోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన 2017 జనవరి నుంచి భారత్‌ లో ట్రంప్ ఆర్గనైజేషన్ ఎలాంటి వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయలేదని తెలిపారు.

ట్రంప్ ఆర్గనైజేషన్ స్థానిక భాగస్వామి అయిన లోధా గ్రూప్ ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జాప్ ట్రంప్ మాట్లాడారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నందువల్ల ఎలాంటి వివాదాలకు తావులేకుండా కొత్తగా విదేశీ ఒప్పందాలేవీ కుదుర్చుకోవద్దని నిర్ణయించామని చెప్పారు. `మేం తిరిగి వ్యాపారం మొదలు పెట్టిన ప్పుడు.. భారతీయ మార్కెట్ మాకు ప్రధానమైనదిగా నిలుస్తుంది` అని తెలిపారు. ముంబైలో మొట్టమొదటిది, 78 అంతస్తుల విలాసవంతమైన ట్రంప్ టవర్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గురువారం రిబ్బన్ కట్‌ చేశారు. లోధా గ్రూప్ భాగస్వామ్యంతో వర్లి ప్రాంతంలో నిర్మించిన ఈ టవర్‌ లో నివాసం ఉండే వారికి ప్రైవేటు విమాన సేవలను అందిస్తున్నారు.
Tags:    

Similar News