కొన్ని దశాబ్దాల క్రితం తన అమ్మమ్మ చేసిన తప్పును పెద్ద మనసుతో క్షమించి వదిలి పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిసి విన్నవించారు హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్. రియాల్టీ స్టార్ గా.. హాలీవుడ్ నటిగా సుపరిచితురాలైన కిమ్.. ట్రంప్ ను తాజాగా కలిశారు. తన అమ్మమ్మ మేరీ జాన్సన్ (63)ను పెద్ద మనసుతో క్షమించాలన్నారు.
కిమీ అమ్మమ్మ జాన్సన్ మోడల్ గా పని చేసేవారు. డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. అమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు ఆమెకు యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. అప్పటి నుంచి సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గుతున్న ఆమెకు ఇప్పుడు 63ఏళ్లు. ఇదిలా ఉంటే.. తన అమ్మమ్మ తప్పు చేసిందని.. ఆమెను పెద్ద మనసుతో వదిలిపెట్టాలని కిమ్ కోరుతున్నారు.
తన అమ్మమ్మపై ఉంచిన డ్రగ్స్ కేసును మరోసారి విచారించి.. ఆమె పట్ల కనికరం చూపాలని కోరుతున్నారు. రెండు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో.. ఆమెను అధ్యక్షుడి క్షమాభిక్ష కోటాలో విడిచి పెట్టాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. కిమ్ తో తన భేటీ చాలా గొప్పగా జరిగిందని.. తమ భేటీలో భాగంగా జైలు సంస్కరణలు.. నేరాలకు విధించే శిక్షల మీద ఆసక్తికర చర్చలు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ రోజు (మే 30)న కిమ్ అమ్మమ్మ పుట్టిన రోజు. మరి.. ఈ సందర్భంగా ట్రంప్ ఆమెకు క్షమాభిక్ష ప్రసాదిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.