ట్రంప్ ఎగ్గొట్టిన ట్యాక్స్ ఎంతంటే?

Update: 2016-10-03 06:57 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి తన ప్రత్యర్థి హిల్లరీపై నిత్యం ఏదో ఒక ఆరోపణ చేసి ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా తానే ఇరుక్కున్నారు. అది కూడా పన్ను ఎగవేత వ్యవహారం కావడంతో జనాలు ఆయన్న ఛీకొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎన్నికల్లో ఆయన అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
    
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పన్నుల ఎగవేత వ్యవహారం ఆయన అభ్యర్థిత్వంపైనే పెను ప్రభావం చూపబోతోంది.  గత 18 ఏళ్లుగా ట్రంప్ పన్నులు కట్టలేదంటూ కథనాలు రావడంతో ట్రంప్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో చిక్కుకున్నారు.  మరోవైపు ట్రంప్ వ్యవహారమూ అందుకు ఊతమిస్తోంది.... తన పన్నుల వివరాలను వెల్లడించడానికి ట్రంప్ నిరాకరిస్తుండడంతో అనుమానాలు బలపడుతున్నాయి.
    
1995లో ఆదాయం పన్ను వివరాలను దాఖలు చేసిన ట్రంప్ 916 మిలియన్ డాలర్ల మేర నష్టం వచ్చిందని ప్రకటించారు. అప్పటినుంచి 18 ఏళ్లుగా తన ఆదాయపు వివరాలను వెల్లడించనే లేదు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు తమ ఆదాయ పన్ను వివరాలను వెల్లడించడం ఆనవాయితీ. కానీ ట్రంప్ మాత్రం తన ఆదాయపు పన్ను వివరాలను వెల్లడించకుండా దాటవేత ధోరణినే అవలంబిస్తున్నారు. దీంతో ఆయన పన్నులు కడుతున్నారా లేదా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. నిజంగానే ట్రంప్ రెండు దశాబ్దాలుగా పన్ను ఎగ్గొడితే అది లక్షల డాలర్లలోనే ఉంటుందని అంచనా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News