నోటికి వచ్చినట్లు మాట్లాడటం డోనాల్డ్ ట్రంప్ కు అలవాటే. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితంగా మారిన ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగటం ఖాయంగా మారిన సంగతి తెలిసిందే. ముస్లింలపై కత్తి కట్టినట్లుగా మాట్లాడే ట్రంప్.. తన నోటి నుంచి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించాలని.. అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గతంలో ఇదే తరహా వ్యాఖ్యల్ని చేసిన ట్రంప్ మీద పలువురు మండిపడ్డారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్లింల మీద తన వ్యతిరేకతను వ్యక్తం చేసిన ట్రంప్ మాటల్ని ఆయన ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్న డెమోక్రాటిక్ అభ్యర్థుల్లో ఒకరైన హిల్లరీ క్లింటర్ తీవ్రంగా మండిపడ్డారు.
ఇది ప్రమాదకరమైన ధోరణిగా అభివర్ణించిన ఆమె.. దీన్ని సహించరానిదని వ్యాఖ్యానించటం గమనార్హం. రిపబ్లికన్ల అభ్యర్థిగా ట్రంప్ ఫైనల్ కానున్న నేపథ్యంలో.. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు మరెన్ని సంచలనాలు కావటం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది.