ట్రంప్ ఇగో దెబ్బతింది. తన కాళ్లకింద కుక్కలా బతికే పాకిస్తాన్ పైకి భారత్ యుద్ధవిమానాలు ప్రయోగించడం ట్రంప్ తట్టుకోలేకపోయాడు. పైపైకి నవ్వుతూనే ఉన్నా, ఉగ్రవాదం వద్దని కల్లబొల్లి కబుర్లు చెప్పినా కానీ.. లోలోపల మాత్రం కుమిలిపోతున్నాడు. ఇలా దాడులు చేసుకుంటే పోతే.. భారత్ ఎక్కడ తన చేజారిపోతుందేమోనని భయపడిన ట్రంప్.. అమెరికా తరహా రాజకీయాలు మొదలుపెట్టాడు. ముందుగా పాకిస్తాన్‌ని చెడామడా తిట్టేశాడు. అసలు మీమ్మల్ని ఎఫ్16 యుద్ధ విమానాల్ని ఎవడు వాడమన్నాడు, ముందు సమాధానం చెప్పండి అంటూ గర్జించాడు. విషయం కాస్త సైలెంట్ అయిన తర్వాత ఇండియాను టార్గెట్ చేశాడు.
ముందుగా మన ఆర్థిక వ్యవస్థ మీద కొట్టేందుకు సిద్ధమయ్యాడు. మన వస్తువులు అమెరికాకు - అమెరికా వస్తువులు ఇండియాకు ఎగుమతి - దిగుమతి అవుతుంటాయి. అయితే.. మన వస్తువుల్ని అమెరికా దిగుమతి చేసుకున్నప్పుడు కొన్ని పన్నులు విధిస్తారు. అయితే.. మనతో ఉన్న స్నేహభావం వల్ల ఇన్నాళ్లు ఆ పన్నులు మినహాయింపు ఇచ్చారు. ఇందుకోసం భారత్ కు ప్రాధాన్యత వాణిజ్య హోదాను ఇస్తున్నారు. ఇప్పుడు ఈ హోదాని తొలగించాలని భావిస్తున్నాడు ట్రంప్. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు లేఖ ద్వారా ట్రంప్ చెప్పేశారు. ఈ నిర్ణయంతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ హోదా పోతే.. అన్ని వస్తువులపై సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మన వస్తువులకు రేట్లు పెరిగి డిమాండ్ తగ్గిపోతుంది. విదేశీ మారకద్రవ్యం కూడా వచ్చేందుకు అవకాశం ఉండదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందన్నమాట. మనల్ని కంట్రోల్ లో పెట్టేందుకు ట్రంప్ ఈ విధంగా పావులు కదుపుతున్నాడు.