జీ 7 దేశాల సదస్సు ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి హాజరైన భారత ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న సరదా సంఘటన అందరిని ఆకర్షించింది. ఇరుదేశాధినేతల మధ్య చోటు చేసుకున్న ఈ ఉదంతం కాసేపు అందరిని నవ్వించింది.
సదస్సులో భాగంగా మోడీ - ట్రంప్ ల మధ్య జరిగిన మీటింగ్ గురించి మీడియాప్రశ్నలు వేసింది. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు స్పందించిన మోడీ.. ముందు తమ మధ్య చర్చలు జరగనిస్తే.. తర్వాత అన్ని వివరాలు చెబుతామంటూ హిందీలో బదులిచ్చారు.
ప్రధాని మోడీ పక్కనే ఉన్న ట్రంప్ మధ్యలో కలుగజేసుకుంటూ.. మోడీ అద్భుతమైన ఇంగ్లిషు మాట్లాడగలరు. కానీ.. ఆయన మాట్లాడటానికి ఇష్టపడరంతే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో.. ఇరువురు నేతలు నవ్వుతూ ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నారు. దీనికి బదులుగా ఆ సమావేశ మందిరంలో ఉన్న వారంతా నవ్వేశారు.
మొత్తానికి మోడీలోని టాలెంట్ ను ట్రంప్ సమయానికి తగ్గట్లు బయటపెట్టారని చెప్పాలి. ఇటీవల డిస్కవరీ ఛానల్ కోసం తీసిన ఎపిసోడ్ లోనూ మోడీ హిందీలో మాట్లాడటం తెలిసిందే. తరచూ హిందీలో మాట్లాడే మోడీఇంగ్లిషు వచ్చినప్పటికీ.. తన భాషలోనే మాట్లాడటానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదే విషయాన్ని కాస్త అతిశయం మిక్స్ చేసి ట్రంప్ మోడీని పొగిడేశారని చెప్పాలి.