కొన్ని దశాబ్ధాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న అమెరికా - ఉత్తర కొరియాలు ఇప్పుడు ప్రియమైన స్నేహితులుగా మారిపోయాయి. ఈ మధ్యే ఈ రెండు దేశాలు చర్చల బాట పట్టిన సంగతి తెలిసిందే.. గడిచిన జూన్ లో సింగపూర్ లో అధ్యక్షులు ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య తొలి దశ చర్చలు జరిగాయి. మరోసారి భేటి అయ్యి సమస్యలు పరిష్కరించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.
తాజాగా రిపబ్లిక్ పార్టీకి మద్దతుగా జరిగిన ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పై ప్రశంసలు కురిపించారు. కిమ్ తనకు అందమైన లేఖలు రాశాడని.. అందులో గొప్ప మాటలున్నాయని.. తామిద్దరం ఇప్పుడు ప్రేమలో పడ్డామని ’ చెప్పుకొచ్చాడు.
ఇక్కడే కాదు గత సోమవారం ఐక్యరాజ్యసమితిలో కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ కిమ్ శాంతి బాటపట్టాడని కొనియాడారు. గత సంవత్సరం ఇదే ఐక్యరాజ్యసమితిలో కిమ్ మానవ హక్కులను ఉల్లంఘించాడని ఆడిపోసుకున్న ట్రంప్ సంవత్సరం తిరిగే సరికల్లా కిమ్ ను ఆకాశానికెత్తేయడం విశేషంగా మారింది.. కిమ్ తనకు లేఖ పంపించిన నేపథ్యంలోనే మరోసారి కిమ్ తో భేటి కావడానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.