వలసలపై మరో నిషేధ ఉత్తర్వు జారీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకను అడ్డుకునేలా వచ్చే వారంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీ చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ట్రావెల్ బ్యాన్ పై వెనక్కి తగ్గేది లేదని హోం లేండ్ సెక్యూరిటీ సెక్రటరీ జాన్ కెల్లీ తాజాగా ప్రకటించారు. కోర్టు నిర్ణయం దేశ భద్రత - రక్షణకు ప్రమాదకరమైందని.. కొత్త ఉత్తర్వులు చాలా పక్కాగా ఉంటాయి. అమెరికాకు వచ్చేవారిని చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నామని ట్రంప్ అండ్ కో చెబుతోంది.
మరోవైపు ట్రంప్ ఉత్తర్వుల అమలును పునరుద్ధరించాలంటూ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ట్రంప్ ఉత్తర్వులపై కోర్టు పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ మాట్లాడుతూ... ‘ట్రంప్ సర్కారు సుప్రీంను ఆశ్రయించడంతో అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమైంది’ అని చెప్పారు. అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్... వలసల ఉత్తర్వులపై ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ మేరకు టెక్సస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు న్యాయ శాఖకు మద్దతుగా పిటిషన్ వేశారు.
మొత్తానికి ట్రంప్ దెబ్బకు గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా గడగడలాడుతున్నారు. కోర్టులకు దొరక్కుండా నిబంధనలు మారుస్తూ ట్రంప్ తన మాట నెగ్గించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అలజడి రేగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/