ట్రంప్ కి అధ్య‌క్షుడి కారు ఇప్ప‌టికి త‌యారైంది

Update: 2017-04-29 04:14 GMT
ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికా అధ్య‌క్షుడికి భ‌ద్ర‌తా ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ప్ర‌పంచంలోనే అత్యంత ప‌వ‌ర్ ఫుల్ నేత అయిన అమెరికా అధ్య‌క్షుడు ఉపయోగించ‌టానికి అత్యాధునిక వ‌స‌తులున్న కారును ఉప‌యోగిస్తుంటారు. బీస్ట్ గా పిలిచే అమెరికా అధ్య‌క్షుడి కారును.. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ గ్రేడ్ చేస్తుంటారు. ఒబామా చేత‌ల నుంచి అధ్య‌క్ష ప‌గ్గాల్ని చేప‌ట్టిన ట్రంప్‌ కు అధ్య‌క్ష‌ కారు ఎప్పుడో సిద్ధం కావాల్సి ఉంది. అయితే.. ఆయ‌న కోరుకున్న‌ట్లుగా కార్లు సిద్ధం కాలేదు. తాజాగా ఆయ‌న అనుకున్న‌ట్లుగా కార్ల‌ను సిద్ధం చేశారు. అధ్య‌క్షుడి కోసం ఉప‌యోగించేందుకు మొత్తం 12 కార్లు సిద్ధంగా ఉంటాయి. ఒక్కో కారు విలువ రూ.100 కోట్లు మాత్ర‌మే. మ‌రింత ఖ‌రీదైన కారులో ఉండే పీచ‌ర్స్ గురించి వింటే నోట మాట రాదంతే.

భ‌ద్ర‌తాప‌రంగా ఏ చిన్న వంక ఉండ‌ని ఈ కారు విశేషాలు చూస్తే.. ఈ కారు త‌లుపుల మందం 8 అంగుళాలు. వీటి ప్ర‌త్యేకత ఏమిటంటే.. బోయింగ్ 757 విమానానికి ఉండే లాంటి త‌లుపులే వీటికీ ఉంటాయి. హెడ్ లైట్ ప‌క్క‌నే ఉండే కెమేరాలు రాత్రిపూట కూడా స్ప‌ష్టంగా.. ఫోటోలు.. వీడియోలు తీయ‌గ‌ల‌వు. ఈ కారులో అధ్య‌క్షుడితో క‌లిపి న‌లుగురు కూర్చునే స‌దుపాయం ఉంటుంది. ప్ర‌తి వ్య‌క్తిని స‌ప‌రేట్ చేస్తూ.. గ్లాస్ పార్టీష‌న్ ఉంటుంది. ఈ కారు అద్దాల్ని అధ్య‌క్షుల వారు మాత్ర‌మే కింద‌కు దింప‌గ‌ల‌రు. ఈ కారు త‌లుపుల మందం 8 అంగుళాలు. బోయింగ్ 737 విమానికి ఉండే త‌లుపులు వీటికి ఉంటాయి.

కారు కిటికీలు ఐదు అంగులాల మందంతో రూపొందించిన అద్దాలు ఈ కారుకు అమ‌ర్చారు. బుల్లెట్ల‌ను ఆపే శ‌క్తి వీటికి ఉంది. ఈ కారు డ్రైవ‌ర్ కు అమెరికా సీక్రెట్ ఏజెంట్స్ అధికారుల‌కు ట్రైనింగ్ ఇస్తారు. ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో 180 డిగ్రీల జె ట‌ర్న్ తో కారును త‌ప్పించ‌గ‌ల సామర్థ్యం ఉంటుంది. ఈ కారుకు అగ్నిమాప‌క ప‌రిక‌రాలు కూడా అమ‌ర్చి ఉంటాయి.

 డాష్ బోర్డులో క‌మ్యూనికేష‌న్ సెంట‌ర్‌.. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఉంటాయి. కారులోనే సెల్ ట‌వ‌ర్ కూడా ఉంటుంది. అధ్య‌క్షుడి సీటుకే శాటిలైట్ ఫోను ఉంటుంది. ఈ ఫోన్‌ కు ఉపాధ్య‌క్షుడు.. పెంగాన్ ల‌కు నేరుగా లైన్ క‌నెక్ట్ అయి ఉంటుంది. ఈ కారు ఆయిల్ ట్యాంక్ ఎంత ప‌టిష్ట‌మైన‌దంటే.. దీని కింద బాంబు పేలినా.. చెక్కుచెద‌ర‌దంతే. డ్రైవ‌ర్ ప‌క్క సీటుకు అనుకొని.. అత్యాధునిక ఆయుధాల‌తో పాటు.. అధ్య‌క్షుడి గ్రూప్‌ కి చెందిన బ్ల‌డ్ ప్యాకెట్లు రెఢీగా ఉంచుతారు. రెయిన్ ఫోర్స్ డ్ స్టీల్ ప్లేట్ల‌తో నిర్మిత‌మైన చాసిస్‌.. బాంబు దాడుల్ని కూడా త‌ట్టుకునేలా ఉంటుంది.

కారు పంక్చ‌ర్ అయినా.. ప‌గిలినా ముందుకు వెళ్ల‌గ‌ల‌దు. ప్ర‌యాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. జీవ‌ర‌సాయ‌న దాడుల్ని కూడా త‌ట్టుకోగ‌ల ఈ కారు బ‌రువు 8 ట‌న్నులు. ఏదైనా అనుకోని ఉప ద్ర‌వం ఎదురైతే.. వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా.. ఆక్సిజ‌న్ అందించే వ్య‌వ‌స్థ కూడా కారులోనే ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News