ఈమధ్యకాలంలో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన - తన కుమార్తెపై సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు సహా పలు వివాదాల్లో చిక్కుకున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి హెచ్-1బీ అంశంపై మాట్లాడారు. ఈ విషయంలో మరోసారి హెచ్-1బీ వీసాలు - ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అంశాన్ని అధ్యక్ష ఎన్నికలో మరోసారి ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. వర్క్ వీసాల పేరుతో కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను దిగుమతి చేసుకుంటున్నాయని, ఈ విషయంలో భారతీయులు ఎక్కువమంది ఉంటున్నారని, దానివల్ల అమెరికన్ల ఉద్యోగాలకు సమస్యలు వస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
సెంటిమెంట్ అస్త్రం అనేది - స్థానికత అనే అంశం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నికల్లో సక్సెస్ పాయింటే అని భావించాడో ఏమో కానీ మరోసారి అమెరికా యువతపైనా - కాలేజీ విద్యార్థులపైనా స్థానికత టాపిక్ తీసుకొచ్చారు ట్రంప్. ఒహైయోలోని సిన్సినాటి నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్... హెచ్-1బీ వీసాలు - ఔట్ సోర్సింగ్ ద్వారా కంపెనీలు ఇతర దేశాల నుంచి తక్కువ జీతాలకు ఉద్యోగులను తెచ్చుకుంటున్నాయని, తాను అధ్యక్షడైతే పరిస్థితి ఇలా ఉండదని, అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని - ఉద్యోగాలు అన్నీ ముందుగా అమెరికన్లకు దక్కేలా చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా తల్లుల్లో చాలా మంది తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోనని ఆందోళనపడుతున్నారని, ఈ విషయం తాను చూసుకుంటానని చెబుతున్నారు ట్రంప్. ఇదే విషయంలో ప్రత్యేకంగా భారత్ ను ప్రస్థావించిన ట్రంప్... ముఖ్యంగా భారత్ నుంచే ఎక్కువ మంది ఈ హెచ్-బీ వీసాలతో వస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఇమ్మిగ్రేషన్ పాలసీ మారుస్తానని, ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత అమెరికన్లకే ఇస్తానని, అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
దీంతో మరోసారి హెచ్-1 బీ వీసాలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, అనంతరం లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ట్రంప్... వాస్తవానికి తానే ఈ విషయంలో బాధితుడిని అని - తనపై డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ కుట్రపన్నారని ఆరోపించారు. కాగా, తాజాగా ముస్లింలు సైతం హిల్లరీకే మద్దతు పలుకుతున్నారని ఒక సర్వేలో తేలింది. అమెరికాలోని ప్రతి పదిమంది అమెరికన్ ముస్లింలలో ఏడుగురు హిల్లరీకే ఓటేస్తామని చెప్పినట్లు ఆ సర్వే చెబుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/