డొనాల్డ్ ట్రంప్....అమెరికా అధ్యక్ష బరిలో నిలిచింది మొదలుకొని కలకలం సృష్టించే కామెంట్లు, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత షాక్ కొట్టే నిర్ణయాలు తీసుకున్న నాయకుడు. ఎవరేం అనుకున్నా తను చేయాలనుకున్నది చేసే మొండి ఘటం. ఏడు దేశస్థులకు వీసాల నిషేధంతో ముస్లింలను టార్గెట్ చేయడం, హెచ్1బీ వీసాలపై కత్తిగట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులైన ఉద్యోగులను కలవరపాటుకు గురిచేయడం, ఒబామా హెల్త్‌కేర్‌ను రద్దుచేసి సాక్షాత్తు దేశ ప్రజలకే షాక్ ఇవ్వడం...ఇలా ట్రంప్ శైలి అత్యంత భిన్నం - వివాదాస్పదం. ఇదే రీతిలో ప్రపంచం అంతటినీ ప్రభావితం చేసేలా ట్రంప్ కొద్దికాలం క్రితం తీసుకున్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం.
పర్యావరణ మార్పుల నిరోధానికి ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పంపై వైదొలగడంపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు తలెత్తాయి. అన్ని దేశాలు ట్రంప్‌ను టార్గెట్ చేశాయి. ఇలాంటి వాటిని గతంలో ఏ మాత్రం పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకోకపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో కలిసి పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి త్వరలోనే ఏదో జరగవచ్చు. దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే మంచిదే, ఒకవేళ ఏ ప్రయోజనం లేకపోయినా మంచిదే. అదేమిటో చూద్దాం’అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. తద్వారా ఈ ఒప్పందానికి సంబంధించి తన వైఖరిలో మార్పు ఉండే అవకాశం ఉండొచ్చునని సూచనప్రాయంగా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ఒప్పందం గురించి మాట్లాడతానని ట్రంప్ చెప్పారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ వాతావరణ ఒప్పందంపై తమ మధ్య గల విభేదాలను తెలుసుకున్నామని అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని, కానీ తాము మాత్రం పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని మాక్రాన్ స్పష్టం చేశారు. ఒప్పందంపై విభేదాల గురించి మాట్లాడుతూ, గతంలో అనేకసార్లు వీటిపై చర్చించామని, దీనిపై ముందుకు సాగడమెలా అనే విషయాన్ని పరిశీలించడం ముఖ్యమని మాక్రాన్ అన్నారు. దీనివల్ల ఇతర అంశాలపై కొనసాగుతున్న చర్చలు నిలిచిపోవని అన్నారు. అంతకుముందు జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొన్న మాక్రాన్, ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిలె పెరేడ్ లో ట్రంప్ పాల్గొనడంపై చెలరేగిన విమర్శలపై విస్మయం వ్యక్తం చేశారు. వాతావరణ ఒప్పందంపై విభేదాలున్నప్పటికీ తమకు అమెరికా వ్యూహాత్మక మిత్రపక్షమని స్పష్టం చేశారు