ట్రంప్ ఆ పాయింట్‌ ను కూడా వ‌ద‌ల్లేదు

Update: 2017-01-16 15:31 GMT
ఎన్నిక‌ల‌కు ముందు ఒక‌మాట‌ - ఎన్నిక‌ల త‌ర్వాత ఒక‌మాట చెప్పే రాజ‌కీయ నాయ‌కుల‌కు తాను పూర్తి భిన్నం అని అమెరికా కాబోయే అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు నిరూపించుకున్నారు. యురోపియ‌న్ దేశాల‌ను వ‌ణికిస్తున్న శ‌ర‌ణార్థుల స‌మ‌స్య‌లపై గ‌తంలో చేసిన కామెంట్ కే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ట్రంప్ తేల్చిచెప్పారు. శ‌ర‌ణార్థుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించి జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ భారీ త‌ప్పు చేశార‌ని  అభిప్రాయ‌ప‌డ్డారు. బ్రిటీష్‌ - జ‌ర్మ‌నీ వార్తాప‌త్రిక‌ల‌కు ట్రంప్ తాజాగా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న విదేశీ విధానంపై మాట్లాడుతూ శ‌ర‌ణార్థుల విష‌యంలో ఘాటుగా రియాక్ట‌య్యారు.

సిరియా - ఇరాక్ స‌హా ఇత‌ ఆఫ్రికా దేశాల నుంచి అక్ర‌మంగా వ‌ల‌స‌వెళ్లుతున్న వారికి జ‌ర్మ‌నీ ఆశ్ర‌యం క‌ల్పించింది.  సుమారు ప‌ది ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థుల‌కు ఇలా జ‌ర్మనీ నీడ నిచ్చింది.  దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ ప‌రిణామంపై తాజాగా మీడియాతో మాట్లాడుతూ యూరోప్ ఖండంలో జ‌ర్మ‌నీ కీల‌క‌మైన దేశ‌మ‌న్నారు. అలాంటి దేశ సార‌థిగా ఉన్న మెర్క‌ల్ ద‌యాహృద‌యంతో స్పందించి చిక్కుల్లో ప‌డ్డార‌ని విశ్లేషించారు. విదేశాల‌తో అమెరికా స్నేహ‌పూర్వ‌క వాణిజ్య సంబంధాల‌ను కోరుకుంటున్న‌ట్లు ట్రంప్ చెప్పారు. వాణిజ్య ప‌రంగా వివిధ దేశాల‌తో ఉన్న లోటు గురించి ప‌రిశీలించాల‌న్నారు. ఫ్రీ ట్రేడ్ క‌న్నా, స్మార్ట్ ట్రేడ్ అన్న నినాదంతో వాణిజ్యం కొన‌సాగించాల‌ని త‌మ ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌నున్న‌ట్లు ట‌రంప్ స్ప‌ష్టం చేశారు. ర‌ష్యాతో ఉన్న సంబంధాల‌పై ట్రంప్ స్పందిస్తూ, ఇరు దేశాలు అణ్వాయుధాల త‌గ్గింపుపై నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. 2003లో ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేయ‌డం అతిపెద్ద త‌ప్పు అని ట్రంప్ పున‌రుద్ఘాటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News