ఉత్తరకొరియా, అమెరికాల మధ్య నెలకొన్ని ఉద్రిక్తతలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు అగ్రరాజ్యంపై కామెంట్లతో విరుచుకుపడిన ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్.. ప్రపంచ దేశాలతో చీవాట్లు తిన్న విషయం తెలిసిందే. అదేసమయంలో ఐక్యరాజ్యసమితి సహా మిత్ర దేశం చైనా నుంచి కూడా ఆంక్షలు ఎదుర్కొన్నాడు. ఈ ఆంక్షల దాడి ఎక్కువవడంతో కిమ్ ఒకింత మెత్తబడ్డట్టే కనిపించింది. అయితే, ఇప్పుడు తన వంతా అన్నట్టు నిన్న మొన్నటి వరకు అమెరికాపై రెచ్చిపోయిన కిమ్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టిన అగ్రరాజ్య అధినేత ట్రంప్ తాజాగా.. తాను ఇప్పుడు ఉ.కొరియాపై రెచ్చిపోయారు.
సమాధానానికి సమాధానం అన్నట్టుగా కాకుండా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఉత్తర కొరియాతో చర్చలు జరుపుతామని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్ అన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్.. లిటిల్ రాకెట్ మ్యాన్(కిమ్ జాంగ్ ఉన్) తో సంప్రదింపులకు ప్రయత్నించడం సమయాన్ని వృథా చేసుకోవడమేనని బాంబు పేల్చారు. తాము ఇప్పటి వరకు చేసిన మాదిరిగానే తమ పని తాముచేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడితో మంచిగా ఉండటం గత 25 సంవత్సరాలుగా కుదరలేదని అన్నారు.
మరి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గతంలో క్లింటన్, బుష్, ఒబామాలు ఈ విషయంలో విఫలయ్యారని, తాను మాత్రం అసలు విఫలం కాబోనని పేర్కొన్నారు. అయితే, నిన్న మొన్నటి వరకు కిమ్ రెచ్చగొడుతున్నాడని, సహనాన్ని పరీక్షిస్తున్నాడని ప్రపంచ దేశాల వేదికలపై పెద్ద ఎత్తున రోదించిన ట్రంప్ ఒక్కసారిగా ఇలా మాటల తూటాలు పేల్చడం ఏమిటని, రెచ్చగొట్టడం ఎందుకని వివిధ దేశాధినేతలు ప్రశ్నిస్తున్నారు. మరి కిమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి ట్రంప్ వ్యాఖ్యలు రెచ్చగొడుతున్నాయి.